Sleeping Facts: నిద్రపోయిన తర్వాత శరీరంలో ఏమేం జరుగుతాయో తెలుసా?

హిప్నో గోజిక్ జెర్క్. ఇది వ్యక్తి నిద్రలోకి జారుకున్నపుడు సంభవించే అసంకల్పితంగా పడిపోయే చర్య. నిద్రిస్తున్నపుడు పెద్ద భవనం లేదా ఎత్తు నుండి పడిపోయినట్లు అనిపిస్తుంది.

Published By: HashtagU Telugu Desk
Health Tips

Health Tips

Sleeping Facts: మనం రోజంతా ఉత్సాహంగా పనిచేయాలంటే.. శరీరానికి విశ్రాంతి చాలా అవసరం. రోజంతా అలసిన శరీరానికి విశ్రాంతి దొరికేది నిద్రలోనే. అలా పడుకోగానే.. మన శరీరంలో చాలా విషయాలు జరుగుతాయట. వాటిలో స్లీప్ వాకింగ్, స్లీప్ టాకింగ్ కూడా ఉన్నాయి. ఇంకా పడుకున్నపుడు శరీరంలో ఏమేం జరుగుతాయో తెలుసుకుందాం.

హిప్నో గోజిక్ జెర్క్. ఇది వ్యక్తి నిద్రలోకి జారుకున్నపుడు సంభవించే అసంకల్పితంగా పడిపోయే చర్య. నిద్రిస్తున్నపుడు పెద్ద భవనం లేదా ఎత్తు నుండి పడిపోయినట్లు అనిపిస్తుంది. కానీ చూస్తే ఏమీ ఉండదు.

కొన్నిసార్లు నిద్రలేచిన తర్వాత కొద్ది సెకన్ల నుంచి కొన్ని నిమిషాల వరకూ వ్యక్తి కదలలేడు.. మాట్లాడలేడు. దీనిని స్లీప్ పారాలసిస్ అంటారు. ఈ పరిస్థితి భయానక ఆలోచనలు, ఆధ్యాత్మిక దృశ్యాలతో ముడిపడి ఉంటుంది. ఎక్కువ ఒత్తిడి ఉన్నా ఇలాంటివి జరుగుతాయి.

స్లీప్ వాకింగ్.. ఒక వ్యక్తి బాగా నిద్రపోతున్నపుడు అకస్మాత్తుగా మేల్కొనడం, నడవడం వంటివి చేస్తారు. ఈ స్థితిలో వ్యక్తి స్పృహ లేకుండా నిద్రపోతాడు. ఇది చాలా ప్రమాదకరం. ఎక్కడినుంచైనా పడే అవకాశం ఉంది.

నిద్రలో మాట్లాడే అలవాటు చాలామందికి ఉంటుంది. దాదాపు 30 సెకన్లపాటు ఇది ఉంటుంది. మొదటి 2 గంటల్లో జరుగుతుంది. గాఢంగా నిద్రపోయే ముందు శరీరం మన కలలకు అనుగుణంగా శబ్దాలను సృష్టించే ప్రయత్నాలు చేస్తోంది.

ఏదైనా విషయం గురించి ఎక్కువగా ఆలోచించినపుడు, మీ మనస్సును మరల్చుకోలేనపుడు మెదడు కలలు కంటుంది. అది సరైన నిర్ణయం తీసుకోలేకపోయినప్పుడల్లా.. మళ్లీ మళ్లీ కల పునరావృతమవుతుంది.

నిద్రలో సెక్స్ చేయడం సాధారణం కాదు. ఇది చాలా కొద్ది మందికి మాత్రమే జరుగుతుంది. హఠాత్తుగా నిద్రలేచి సెక్స్ చేయడాన్ని సెక్సోమేనియా అంటారు. మరోమాటలో చెప్పాలంటే శరీరం నిద్ర నుంచి మేల్కొంటుంది. మనస్సు నిద్రపోతుంది.

 

  Last Updated: 26 Dec 2023, 11:26 PM IST