Summer Skincare: వేసవిలో మేకప్ వేసుకుంటున్నారా.. అమ్మాయిలు జాగ్రత్త!

మామూలుగా అమ్మాయిలు ఎక్కడికైనా బయటికి వెళ్లాలి అనుకున్నప్పుడు ఎక్కువగా రెడీ అవుతూ ఉంటారు. ఇక ఎప్పటిలాగే మామూలుగా మేకప్ వేసుకుంటూ ఉం

  • Written By:
  • Publish Date - February 15, 2024 / 10:20 PM IST

మామూలుగా అమ్మాయిలు ఎక్కడికైనా బయటికి వెళ్లాలి అనుకున్నప్పుడు ఎక్కువగా రెడీ అవుతూ ఉంటారు. ఇక ఎప్పటిలాగే మామూలుగా మేకప్ వేసుకుంటూ ఉంటారు. అయితే మేకప్ వేసుకోవడం మంచిదే కానీ ముఖ్యంగా సమ్మర్ లో వేసుకున్నప్పుడు కొన్ని రకాల జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. వేసవిలో కూడా మీ స్కిన్ అందంగా మెరిసిపోవాలంటే కొన్ని రకాల జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి. ఆ వివరాల్లోకి వెళితే.. వేసవిలో ఎక్కువగా చెమటగా ఉండి జిడ్డుగా ఉంటుంది. కాబట్టి, మాయిశ్చరైజర్ రాయకపోయినా పర్లేదు అని చాలా మంది అనుకుంటారు..కానీ అది ఏ మాత్రం మంచిది కాదు.

స్కిన్‌ని కాపాడుకునేందుకు హైలురోనిక్ యాసిడ్, నియాసినమైడ్ వంటి హైడ్రేటింగ్ మాయిశ్చరైజర్‌ని ఉపయోగించడం వల్ల చర్మంలోని హైడ్రేషన్‌ని అలానే ఉంచి స్కిన్ పాంపర్‌‌గా చేస్తుంది. ఎక్స్‌ఫోలియేషన్ అనేది ఏ కాలమైనా చేయాల్సిందే. దీని వల్ల చర్మంపై ఉన్న డెడ్స్కిన్ సెల్స్ పోయి, కొత్త కణాలు వచ్చి చర్మ ఛాయ మెరుగ్గా కనిపిస్తుంది. అందుకోసం కచ్చితంగా స్క్రబ్ చేయాలి. దీని వల్ల మూసుకుపోయిన చర్మ రంధ్రాలు తెరుచుకుంటాయి. అదేవిధంగా క్స్‌ఫోలియేట్ చేసేటప్పుడు స్క్రబ్‌లోని గ్రాన్యూల్స్ తేలిగ్గా, గుండ్రంగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల స్కిన్‌పై ఎలాంటి ఎఫెక్ట్ పడదు. అదే విధంగా, హార్డ్‌గా ఉండొద్దు క్రీమిగా ఉండాలి.

దీంతో పాటు వారానికి ఓ సారైనా ఎక్స్‌ఫోలియేట్ చేయాలని గుర్తుపెట్టుకోవాలి..మిగతా రోజుల్లా ఈ సమయంలో ఎక్కువగా మేకప్ వాడకపోవడమే మంచిది. ఫౌండేషన్, కన్సీలర్, బ్లష్ వంటివన్నీ రాయడం వల్ల చర్మ రంధ్రాలు మూసుకుపోయి. ఇబ్బంది అవుతుంది. అంతేకాకుండా, చమటకి ఈ మేకప్ మొత్తం కారిపోతుంది. అందుకని, ఇలాంటివి కాకుండా బీబీ క్రీమ్ వంటి లైట్ మేకప్ వాడడం మంచిది. సాధారణంగా ఈ కాలంలో ఎంతగా హైడ్రేషన్ ఉంటే అంత మంచిది. అందుకే కచ్చితంగా నీరు తాగడం మంచిది. దీని వల్ల చర్మం డ్రైగా కాకుండా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంత మంచిదో స్కిన్ హెల్త్‌కి కూడా అంత మంచిది.

అందుకే కచ్చితంగా సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం మంచిది. హైడ్రేషన్ ఉండాలని చెప్పినట్లుగా కూల్ డ్రింక్స్, కార్బోనేటేడ్ కూల్ డ్రింక్స్ తీసుకోవడం, ఆల్కహాల్, టీ, కాఫీ తీసుకోవద్దు. వీటి బదులు కొబ్బరి నీరు, నిమ్మకాయ నీరు తీసుకోవడం మంచిది.. అలాగే సమ్మర్ లో బయటికి వెళ్ళేటప్పుడు సన్ స్క్రీన్ లోషన్ రాయడం, ముఖం కవర్ అయ్యేల క్యాప్ పెట్టుకోవడం, తేలికైన బట్టలు వేసుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. కాబట్టి సమ్మర్ లో పైన చెప్పిన చిట్కాలను పాటించకపోతే అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.