Site icon HashtagU Telugu

‎Pregnancy: గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయవచ్చా, చేయకూడదా.. వైద్యులు ఏం చెబుతున్నారంటే?

Pregnancy

Pregnancy

‎Pregnancy: మామూలుగా స్త్రీలు గర్భవతిగా ఉన్నప్పుడు అనేక జాగ్రత్తలు తీసుకోవాలని తల్లి ఆరోగ్యం పట్ల బిడ్డ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు వహించాలని చెబుతుంటారు. ఏదైనా తినే ముందు వైద్యుల సలహా నిపుణుల సలహా తీసుకోవాలని చెబుతూ ఉంటారు. కానీ కొందరు ప్రెగ్నెన్సీ స్త్రీలు అవేమీ పట్టించుకోకుండా ఏది పడితే అది తింటూ ఉంటారు. అయితే గర్భిణీ స్త్రీలు కొంతమంది వ్యాయామం చేస్తూ ఉంటారు. కొంతమందికి శరీరం సహకరించకపోవడంతో చేయాలని ఉన్నా కూడా భయపడుతూ ఉంటారు.

‎మరి గర్భిణీ స్త్రీలు వ్యాయామం చేయవచ్చో, చేయకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వ్యాయామం చేసే గర్భిణీలకు వెన్నునొప్పి, కాళ్ల వాపు, కటి నొప్పి తగ్గుతాయట. ముఖ్యంగా పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజెస్ చేస్తే నార్మల్ డెలివరీ ఛాన్సెస్ పెరుగుతాయని ఒక అధ్యయనంలో తేలిందట. కాగా తరచుగా ఎక్సర్‌సైజ్ చేసిన అమ్మాయిలకు సిజేరియన్ రేటు 20 నుంచి 30 శాతం తక్కువ అని అంటున్నారు. కాగా గర్భం దాల్చినప్పుడు మహిళల్లో హార్మోన్స్ సమతుల్యత ఉండదు. వ్యాయామం వల్ల ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతాయట. ఫలితంగా డిప్రెషన్, యాంక్సైటీ తగ్గి రోజంతా సంతోషంగా ఉంటారట.

‎ తద్వారా బేబీకి కూడా ఈ హ్యాపీ వైబ్స్ ట్రాన్స్‌ఫర్ అవుతాయని, అందువల్ల పుట్టిన తర్వాత శిశువులు కూడా ఎక్కువగా నవ్వుతారని చెబుతున్నారు వైద్య నిపుణులు. కాగా వ్యాయామంలో భాగంగా వాకింగ్, స్విమ్మింగ్, యోగా వంటివి గర్భిణీల్లో బ్లడ్ షుగర్ లెవెల్స్‌ ని కంట్రోల్‌ లో ఉంచుతాయట. గర్భిణీలు వ్యాయామం చేస్తే బేబీకి ఎక్కువ ఆక్సిజన్, న్యూట్రియెంట్స్ అందుతాయని, ఫలితంగా పుట్టినప్పుడు బేబీ ఆరోగ్యకరమైన బరువుతో ఉంటుందని మెదడు పెరుగుదల మెరుగవుతుందని చెబుతున్నారు. గర్భిణీలు రోజూ 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాకింగ్, ప్రెగ్నెన్సీ యోగా, స్విమ్మింగ్, కీగల్స్ ఎక్సర్‌సైజ్, లైట్ స్ట్రెచింగ్, డీప్ బ్రీతింగ్ వంటివి చేయడం వల్ల బిడ్డ ఆరోగ్యంగా పుడుతుందట. అయితే ఇవి చేసే ముందు వైద్యుల సలహా తీసుకోవడం మంచిది అని చెబుతున్నారు.​ బ్లీడింగ్, తీవ్రమైన నొప్పి, మైకం, గుండె వేగంగా కొట్టుకోవడం వంటి సమస్యలు ఉన్నావారు వ్యాయామం చేయకపోవడమే మంచిదని చెబుతున్నారు.

Exit mobile version