Health Tips: చలికాలంలో వచ్చే సమస్యలు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే?

చలికాలం వచ్చింది అంటే చాలు ఈ చలికాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతే కాకుండా

  • Written By:
  • Publish Date - November 20, 2022 / 08:30 AM IST

చలికాలం వచ్చింది అంటే చాలు ఈ చలికాలంలో ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. అంతే కాకుండా చలికాలంలో తొందరగా రోగాల బారిన పడటం మాత్రమే కాకుండా అవి తొందరగా వ్యాపిస్తూ ఉంటాయి. అయితే చలికాలంలో ఆరోగ్యం పట్ల శ్రద్ధ పెద్ద తీసుకోవడం మాత్రమే కాకుండా వ్యాయామాలు చేయాలి. లేదంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతూ ఉంటాయి. మరి ముఖ్యంగా చలికాలంలో రోగనిరోధక శక్తిని పెంచే ఆహార పదార్థాలను తీసుకోవాలి. మరి చలికాలంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. చలికాలంలో ఎక్కువ మందిని ఇబ్బంది పెట్టే సమస్య చర్మం పొడిబారడం. చర్మం పొడిబారడంతో పాటు దద్దర్లు ఎర్రటి మచ్చలు లాంటివి ఏర్పడుతూ ఉంటాయి.

అయితే చలికాలంలో నీరు తాగాలి అనిపించకపోయినప్పటికీ తగినన్ని నీరు తాగాలి. చర్మాన్ని తేమగా ఉంచుకోవాలి. అలాగే చలికాలంలో కీళ్ల నొప్పులు కూడా వేధిస్తూ ఉంటాయి. చలికాలం చల్లగాలి కారణంగా కండరాలు బలహీనంగా మారుతూ ఉంటాయి. ఇటువంటి సమయంలో ఆరోగ్యం పట్ల ప్రత్యేకంగా సిద్ధ తీసుకోవాలి. ఆ సమయంలో శరీరాన్ని వెచ్చగా ఉంచుకోవడంతో పాటు వెచ్చని దుస్తులు ధరిస్తూ అలాగే పొద్దున్నే ఎండకు కొద్దిసేపు ఉండాలి. చలికాలంలో దగ్గు జలుబు జ్వరం లాంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. చలికాలంలో రోగ నిరోధక శక్తి తగ్గిపోతూ ఉంటుంది. దీంతో బలహీన పడుతూ ఉంటారు. అలాగే చలికాలంలో చాలామంది గొంతు సమస్యతో కూడా బాధపడుతూ ఉంటారు.

వైరల్ ఇన్ఫెక్షన్ కారణంగా గొంతులో వాపు లాంటివి వస్తూ ఉంటాయి. చలికాలం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయానికి వస్తే.. చలికాలం పరిశుభ్రతను కచ్చితంగా పాటించాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. ప్రతిరోజు స్నానం చేసి తిన్న తర్వాత అలాగే ఏదైనా పనిచేసిన తర్వాత శుభ్రంగా చేతులను కడుక్కోవాలి. అలాగే చలికాలంలో పండ్లు కూరగాయలు తప్పకుండా తీసుకోవాలి. చలికాలంలో ఎప్పటికప్పుడు చేసుకున్న వేడివేడి ఆహార పదార్థాలను తినడం మంచిది.