Site icon HashtagU Telugu

Single: అబ్బాయిలూ.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

Men Should Do If They Are Single And Alone Imresizer

Men Should Do If They Are Single And Alone Imresizer

బ్యాచిలర్ లైఫ్ బెస్ట్ లైఫ్…ఈ మధ్య కాలంలో చాలా మంది సింగిల్ గా ఉంటేనే కింగులని భావిస్తున్నారు. పెళ్లయిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో సింగిల్ లైఫ్ బెస్ట్ అని నమ్ముతుంటారు. అనవసరంగా పెళ్లి చేసుకున్నామని భావిస్తుంటారు. ఎందుకంటే సింగిల్ గా ఉంటే ఆ మజానే వేరు. ఆనందంతోపాటు ఎన్నో అద్భుతమైన అవకాశాలు ఉంటాయని అనుకుంటారు. మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎంజాయ్ చేయాలంటే సింగిల్ గా ఉంటే సాధ్యమవుతుందని చాలా మంది మగాళ్లు అనుకుంటున్నారు. అందుకే పెళ్లి అంటేనే తలనొప్పిగా భావిస్తారు. అందుకే ఏదోక కారణం చెప్పి పెళ్లిని వాయిదా వేస్తుంటారు. అయితే ఒంటరిగా ఉండే మగాళ్లు అలాగే ఉండాలనుకుంటే పొరబడినట్లే. ఎందుకంటే మగాళ్లు ఎక్కువ కాలం ఒంటరిగా ఉంటే చాలా రకాల సమస్యలు వచ్చే ప్రమాదనం ఉందని తాజా అధ్యయనాలు చెబుతున్నాయి. ఇంతకీ సింగిల్ గా ఉంటే ఎలా ప్రమాదాలు వస్తాయో తెలుసుకుందాం.

ప్రస్తుతం సమాజంలో చాలా మంది మగాళ్లు 30 దాటినా…మూడు ముళ్లు వేసేందుకు ఇష్టపడటం లేదు. జీవితాన్ని ఆస్వాదించాలంటే ఒంటరిగా ఉంటేనే సాధ్యమవుతుందని భావిస్తున్నారు. అందుకే పెళ్లి అంటే వెంటనే నో చెబుతున్నారు. మరికొందరు పెళ్లి తర్వాత జీవితమంతా బాధ్యతలు, బారాలు, బరువులు భారంగా మారుతుందని…భాగస్వామితో సంతోషకరమైన జీవితాన్ని గడపలేమని…పెళ్లినివాయిదా వేసుకుంటున్నారు.

బ్యాచిలర్ లైఫ్ ను ఎక్కువ కాలంపాటు అలాగే ఉంటే…ఎన్నో సమస్యలను ఎదుర్కోవల్సి వస్తుందని తాజాగా ఓ సర్వేలో తేలింది. అందులోనూ ఎవరైతే సింగిల్ గా ఉంటారో…వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. సింగిల్ గా ఉండే వారు ఎక్కువగా వ్యక్తిగత శుభ్రత పాటించకపోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోకపోవడం వల్ల అనారోగ్యం బారినపడే అవకాశం ఉంటుంది. ఎక్కువ కాలం ఒంటరిగా జీవించడం వల్ల శారీరక, మానసిక సమస్యలతో పాటుగా ఎన్నో రోగాల బారిన పడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

ఎవరైతే ఎక్కువకాలం పాటు సింగిల్ లైఫ్ కు అలవాటు పడతారో…ఎవరితోనూ ఎలాంటి రిలేషన్ షిప్ మెయింటెన్ చేయకుండా ఉంటారో..వారి రక్త కణాల్లో తేడాలొస్తాయి. దీంతో అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.

ఈ పరిస్థితులన్నీ కూడా ఎక్కువగా మగాళ్లలోనే కనిపిస్తున్నాయని నిపుణులు తేల్చారు. ఈ సమాచారం మొత్తాన్ని జర్నల్ ఆఫ్ ఎపిడమాలజీ అండ్ కమ్యూనిటీ హెల్త్ లో ప్రచురించారు. ఎవరైతే ఏళ్లుగా సింగిల్ గా జీవించడం వల్ల చాలా అనారోగ్యాలు, మరణాలు సంబవించే ప్రమాదం ఉందని తేలిందట. వీటితోపాటు భాగస్వామితో విడిపోయి…విడాకులు తీసుకుని సింగిల్ గా జీవించే వారు కూడా మానసికంగా కుంగిపోయి, శారీరంగా బలహీనపడిపోతారు. క్రమక్రమంగా ఇమ్యూనిటీ పవర్ తగ్గి అనేక రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉందని తేలింది. అంతేకాదు ఎవరైతే ఒంటరిగా ఎక్కువ కాలం ఉంటారో…వారు తొందరగా మరణించే ప్రమాదం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు.
.
ఈ పరిశోధన కోసం ఎక్కువగా 48 నుంచి 62 సంవత్సరాల మధ్య ఉన్న వారిని ఎంచుకున్నారు. సుమారుగా 4,835మందిపై చేసి రిపోర్టును రెడీ చేశారు. అందుకే ఇలాంటి ప్రమాదాల బారిన పడకుండా ఉండాలంటే జీవితంలో ఒంటరిగా ఉండటం వంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఒంటరి లైఫ్ అంత మంచిది కాదు. ఓ వయస్సు వచ్చాక ఓ తోడు ఉంటేనే జీవితం సంతోషంగా సాగుతుంది.