Site icon HashtagU Telugu

Gold : శ్రావణం ముగిసింది, ఇక బంగారం ధరల్లో భారీపతనం, తులం బంగారం ఎంత పడిందంటే..?

Gold- Silver Price

Gold

భారత బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు శుక్రవారం కూడా తగ్గుముఖం పట్టాయి. గురువారం లాగే ఈ రోజు కూడా బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. బంగారం చాలా చౌకగా మారింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం రూ.50401కి చేరింది. గురువారం నాడు రూ.51188 వద్ద పలికినట్లు గమనించవచ్చు.

ఇతర స్వచ్ఛత కలిగిన బంగారం, వెండి ధర గురించి మాట్లాడినట్లయితే, 916 స్వచ్ఛత కలిగిన 22 క్యారట్ల బంగారం ధర రూ.46167కు పడిపోయింది. అదే సమయంలో 18 క్యారట్ల బంగారం ధర రూ.37801కి చేరింది. ఇక 999 స్వచ్ఛత కలిగిన ఒక కేజీ వెండి ఈ రోజు రూ.51850 కే అందుబాటులో ఉంది.

బంగారం, వెండి ధరలు ఎంత మేర తగ్గాయి?
ఈరోజు బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 999 స్వచ్ఛత కలిగిన 24 క్యారట్ల పది గ్రాముల బంగారం ధర నేడు రూ.787 తగ్గగా, 916 స్వచ్ఛత కలిగిన 22 క్యారట్ల బంగారం ధర ఈరోజు రూ.721 తగ్గింది. మరోవైపు 999 స్వచ్ఛత కలిగిన కిలో వెండి ధర నేడు రూ.2500 తగ్గింది.

బంగారు నగల స్వచ్ఛతను నిర్ధారించడానికి ఒక మార్గం ఉంది. ఇందులో హాల్‌మార్క్‌కు సంబంధించిన అనేక రకాల గుర్తులు కనిపిస్తాయి. ఈ ముద్రల ద్వారా నగల స్వచ్ఛతను గుర్తించవచ్చు. ఇది ఒక క్యారెట్ నుండి 24 క్యారెట్ల వరకు స్కేల్ కలిగి ఉంటుంది. 22 క్యారెట్ల బంగారాన్ని ఆభరణాల తయారీకి ఉపయోగిస్తారు. ఆభరణాలపై హాల్‌మార్క్ వేయడం కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. 24 క్యారెట్ల బంగారం స్వచ్ఛమైన బంగారం, దానిపై 999 మార్క్ నమోదు చేసి ఉంటుంది.

అయితే, 24 క్యారెట్ల బంగారంతో నగలను తయారు చేయరు. 22 క్యారెట్ల బంగారంతోనే నగలు తయారు చేస్తారు. దీనిపై 916 కేడీఎం అని రాసి ఉంటుంది. 18 క్యారెట్ల ఆభరణాలపై 750 అని రాసి ఉంది. 14 క్యారెట్ల నగలు ఉంటే అందులో 585 అని రాసి ఉంటుంది.

24, 22, 21, 18 మరియు 14 క్యారెట్ల మధ్య తేడా ఏమిటి?
24 క్యారెట్ల బంగారాన్ని స్వచ్ఛమైన బంగారం అంటారు. ఇందులో మరే ఇతర లోహం కల్తీ ఉండదు. దీనిని 99.9 శాతం స్వచ్ఛత కలిగిన బంగారం అంటారు. 22 క్యారెట్ల బంగారంలో 91.67 శాతం స్వచ్ఛమైన బంగారం. మిగతా 8.33 శాతం ఇతర లోహాలతో కూడి ఉంటుంది. అదే సమయంలో, 87.5 శాతం స్వచ్ఛమైన బంగారం 21 క్యారెట్ల బంగారంలో ఉంది. 18 క్యారెట్లలో 75 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుది. ఇక 14 క్యారెట్ల బంగారంలో 58.5 శాతం స్వచ్ఛమైన బంగారం ఉంటుంది.