Papaya Benefits For Skin: బొప్పాయితో ఇలా చేస్తే చాలు.. ముఖం మెరిసిపోవాల్సిందే?

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కె లతోపాటు క్యాల్షియం,

  • Written By:
  • Publish Date - June 26, 2023 / 08:50 PM IST

బొప్పాయి వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. బొప్పాయిలో విటమిన్‌-ఎ, బి, సి, ఇ, కె లతోపాటు క్యాల్షియం, మెగ్నీషియం, జింక్‌, ఫోలేట్‌ వంటి పోషకాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ పండులోని పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్‌ గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే బొప్పాయిలో నీటి శాతం ఎక్కువగానే ఉంటుంది. కాబట్టి ఇది త్వరగా జీర్ణమవడమే కాకుండా కడుపు ఉబ్బరం, మలబద్ధకం లాంటి సమస్యలను తగ్గిస్తుంది. కాగా బొప్పాయి కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా సౌందర్యాన్ని పెంచడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది.

మరి బొప్పాయిని ఉపయోగించి మన సౌందర్యాన్ని ఎలా పెంచుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బొప్పాయిలో పపైన్‌ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. డెడ్ స్కిన్ సెల్స్‌ను తొలగించి చర్మాన్ని శుభ్రపరుస్తుంది. ప్రస్తుత రోజుల్లో చెడు ఆహార అలవాట్ల కారణంగా చాలా మంది మొటిమలతో బాధపడుతున్నారు. మొటిమలు, మొటిమల మచ్చల కారణంగా ముఖం కాంతి విహీనంగా మారుతుంది. మొటిమలు, మొటిమల మచ్చలు తొలగించుకోవడానికి బొప్పాయి ఎఫెక్టివ్‌గా పని చేస్తుంది. టేబుల్‌ స్పూన్‌ బొప్పాయి గుజ్జులో చెంచా తులసి పొడి, తేనె కలిపి రోజూ ఉదయాన్నే ముఖానికి రాయాలి. ఇందులో ఉండే పపైన్‌ అనే ఎంజైమ్‌ వాపుని తగ్గించి చర్మాన్ని కాంతిమంతంగా మారుస్తుంది.

అలాగే బాగా పండిన బొప్పాయిని గుజ్జును పేస్ట్‌లా చేసి ఆ పేస్ట్‌ ని ముఖపై మర్దన చేయాలి. ఇలా 20 నుంచి 30 నిమిషాల వరకు మసాజ్‌ చేయాలి. ఆ తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్‌తో ముఖం మీద ఉండే ట్యాన్ కూడా తగ్గిపోతుంది. ఇలా వారానికి ఒకటి లేదా రెండుసార్లు చేస్తే చర్మం ప్రకాశవంతంగా మెరుస్తుంది. కప్పు బొప్పాయి గుజ్జుకి పాలల్లో నానబెట్టిన ఓట్స్‌ని జతచేసి కొద్దిగా తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి రాసి మృదువుగా రుద్దాలి. రోజూ ఇలా చేస్తే చర్మానికి తేమ అంది నిగారింపు వస్తుంది. బొప్పాయి గుజ్జులో తేనె కానీ పెరుగు కానీ కలిపి రుద్దుకున్నా కూడా చర్మం మెరుస్తూ ఉంటుంది. పావుకప్పు బొప్పాయి గుజ్జుకి కోడి గుడ్డులోని తెల్లసొన, టేబుల్‌ స్పూన్‌ నిమ్మరసం కలపాలి. ఈ మిశ్రమాన్ని కుదుళ్లకు పట్టించి ఒక పావుగంట ఆరనిచ్చి, ఆపై గోరు వెచ్చని నీళ్లతో కడిగేయాలి. ఇలా వారానికోసారి చేస్తే జుట్టు పట్టులా మెరుస్తుంది. జుట్టు రాలడం కూడా ఆగిపోతుంది.