Site icon HashtagU Telugu

Thati Bellam Offee: తాటి బెల్లంతో ఎంతో టేస్టీగా కాఫీ తయారు చేసుకోండిలా?

Mixcollage 12 Jan 2024 07 21 Pm 1700

Mixcollage 12 Jan 2024 07 21 Pm 1700

ఈ రోజుల్లో కాఫీలు,టీలు తాగే వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. ఉదయం లేచిన దగ్గర్నుంచి సాయంత్రం పడుకునే లేపు కనీసం రెండు మూడు సార్లు అయినా కాఫీలు టీలు తాగుతూ ఉంటారు. అయితే కాఫీలు టీలకు ఎక్కువ శాతం మంది చక్కెరను ఉపయోగిస్తూ ఉంటారు. అతి కొద్ది మంది మాత్రమే బెల్లం ఉపయోగిస్తూ ఉంటారు. అయితే ఎప్పుడైనా తాటి బెల్లంతో కాఫీ చేసుకొని తాగారా. తాగకపోతే ఈ తాటి బెల్లం కాఫీ ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

తాటి బెల్లం కాఫీకి కావాల్సిన పదార్థాలు:

నీళ్లు – 1 కప్పు
తాటిబెల్లం – రుచికి తగినంత
ఫ్యాట్ మిల్క్ – పావు లీటర్
కాఫీ పౌడర్ – కావాల్సినంత

తాటి బెల్లం కాఫీ తయారీ విధానం:

ముందుగా తాటి బెల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఒక గిన్నెలో నీళ్లు పోసి అందులో తాటి బెల్లాన్ని వేసి వేడిచేసుకోవాలి. తాటి బెల్లం కరుగుతుండగానే మరో గిన్నెలో పాలు పోసి వేడి చేసుకోవాలి. పాలు మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొద్దిగా చల్లారనివ్వాలి. తాటి బెల్లం కరిగిన తర్వాత కాఫీ పౌడర్ వేసి కలుపుకోవాలి. దీన్ని మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. డికాషన్ కొద్దిగా చల్లారిన తర్వాత ఒక గ్లాస్ పావు వంత డికాషన్ తీసుకోవాలి. తర్వాత పాలు పోసి కలిపి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. అంతే వేడి వేడిగా ఉండే తాటి బెల్లం కాఫీ రెడీ.