Vankaya Kothimeera Karam : వంకాయ కొత్తిమీర కారం.. టేస్టీగా సింపుల్ రెసిపీ..

వంకాయతో కొత్తిమీర కారం(Vankaya Kothimeera Karam) వండుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

  • Written By:
  • Publish Date - September 27, 2023 / 10:00 PM IST

వంకాయలతో(Brinjal) కూర, కుర్మా కూర, పచ్చడి, పులుసు.. వంటివి చేసుకొని తింటాము. వంకాయతో కొత్తిమీర కారం(Vankaya Kothimeera Karam) వండుకొని తింటే ఎంతో రుచిగా ఉంటుంది. దీనిని చాలా తేలికగా ఇంట్లోనే తయారుచేసుకోవచ్చు.

వంకాయ కొత్తిమీర కారంకు కావలసిన పదార్థాలు..

* పచ్చిమిర్చి ఎనిమిది
* వంకాయలు తరిగినవి 500 గ్రాములు
* కొత్తిమీర కట్ట ఒకటి
* జీలకర్ర ఒక స్పూన్
* నూనె నాలుగు స్పూన్లు
* ఉప్పు సరిపడ
* పసుపు పావు స్పూన్
* నీళ్ళు కొన్ని

ముందు ఒక మిక్సి గిన్నెలో కొత్తిమీర, పచ్చిమిర్చి, జీలకర్ర వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని మెత్తగా పట్టుకోవాలి. ఒక మూకుడులో నూనె వేసి కాగినాక వంకాయ ముక్కలు వేసుకొని వేయించుకోవాలి. కొద్దిగా వేగిన తరువాత ఉప్పు, పసుపు వేసుకొని కలబెట్టి వేయించుకోవాలి. వీటిని కొంచెం సేపు వేయించిన తరువాత నీళ్ళు పోసి కలబెట్టాలి. తరువాత మూత పెట్టి ఉడికించుకోవాలి. వంకాయ ముక్కలు వేగి నూనె పైకి తేలిన తరువాత దానిలో మనం మిక్సి పట్టుకున్న కొత్తిమీర కారం వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి కారం పచ్చి వాసన పోయేంతవరకు వేయించుకోవాలి. అంతే వేడి వేడి వంకాయ కారం రెడీ. దీనిని అన్నంతో పాటు తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

 

Also Read : Ghee Side Effects: నెయ్యి తింటే ప్రయోజనాలే కాదు.. సమస్యలు కూడా ఉన్నాయ్..!