Site icon HashtagU Telugu

Pudina Rice Recipe: పుదీనా రైస్.. ఈ కొలతలతో చేస్తే.. వద్దనకుండా తినేస్తారు

pudina rice recipe

pudina rice recipe

Pudina Rice Recipe: పుదీనా.. చాలా మంది దీనిని ఇష్టపడరు. కానీ దీనితో చేసే ఆహారం ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో యాంటీ సెప్టిక్ లక్షణాలు ఎక్కువ. చర్మ సంబంధిత సమస్యలు, నల్ల మచ్చలు, దద్దుర్లు తగ్గుతాయి. పుదీనా ఆకుల్లో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ బి6 అధికం. అలాగే మెగ్నీషియం, ఐరన్, పొటాషియం, క్యాల్షియం వంటివి కూడా శరీరానికి అందుతాయి.

పుదీనా ఆకుల్ని నూరి ముఖానికి రాస్తే.. మీ ముఖం మెరిసిపోవడం ఖాయం. అలాగే మొటిమలు తగ్గుతాయి. హైబీపీ ఉన్నవారు పుదీనా ఆకులు తింటే.. బీపీ కంట్రోల్ లో ఉంటుంది. గుండె సంబంధిత సమస్యలు రావు. మరి ఇన్నిరకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్న పుదీనాతో.. పక్కా కొలతలతో టేస్టీ పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.

పుదీనా రైస్ రెసిపీకి కావలసిన పదార్థాలు

బియ్యం – 1 కప్పు

పుదీనా కట్ట – 1

అల్లం వెల్లుల్లి పేస్ట్ – 1 స్పూన్

పచ్చిమిర్చి – 8

లవంగాలు – 2

దాల్చిన చెక్క – 1 చిన్నముక్క

జీలకర్ర – 1 స్పూన్

కరివేపాకులు – గుప్పెడు

పసుపు – 1/2 స్పూన్

ఉప్పు – రుచికి తగినంత

బిర్యానీ ఆకులు – 2

ఉల్లిపాయ -1

పుదీనా రైస్ రెసిపీ

ముందుగా కుక్కర్ పెట్టి నూనెను వేయాలి. అది వేడయ్యాక లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, బిర్యానీ ఆకు వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొద్దిసేపు వేగాక.. తరిగిన పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసి గోల్డ్ కలర్ కి వచ్చేంత వరకూ వేయించాలి. తర్వాత కొద్దిగా పసుపు వేసి కలపాలి.

పుదీనా ఆకులను మిక్సీలో వేసి.. కొద్దిగా నీరు పోసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని వేగుతున్న ఉల్లిపాయల్లో వేగి బాగా కలపాలి. రుచికి సరిపడా ఉప్పు వేసి.. పచ్చివాసన పోయేంత వరకూ వేయించాలి.

కడిగి పెట్టుకున్న బియ్యం వేసి.. ఉడకడానికి సరిపడా నీళ్లు పోయాలి. పైన కరివేపాకులు వేసి.. కుక్కర్ మూత పెట్టి.. మూడు విజిల్స్ రానిచ్చి స్టవ్ ఆఫ్ చేయాలి. విజిల్ ఆరిన తర్వాత.. వేడి వేడి పుదీనా రైస్ లో చికెన్ కర్రీ కలిపి తింటే.. రుచి సూపర్ ఉంటుంది.

 

 

Exit mobile version