Site icon HashtagU Telugu

Tandoori Egg Recipe: తందూరి కోడిగుడ్డు రెసిపీ.. ఇంట్లోనే సింపుల్గా చేసుకోండిలా?

Mixcollage 08 Mar 2024 10 48 Pm 5632

Mixcollage 08 Mar 2024 10 48 Pm 5632

నాన్ వెజ్ ప్రియులందరికీ కోడిగుడ్డు రెసిపీలంటే చాలా ఇష్టం. గుడ్డుతో అనేక రకాల వంటకాలు చేయచ్చు. చాలా తక్కువ సమయంలో గుడ్డు ఉడికేస్తుంది, అందుకే ఆమ్లెట్, కీమా ఇలా రకరకాలుగా గుడ్డును చేసుకుని తింటారు. అయితే గుడ్డుతో ఎప్పుడూ ఒకే విధమైన రెసిపీలు తిని చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది. మీరు కూడా గుడ్డుతో ఏదైనా సరికొత్తగా రెసిపీ ట్రై చేయాలి అనుకుంటున్నారా. అయితే తందూరి కోడుగుడ్డు రెసిపీని సింపుల్గా ట్రై చేయండిలా.

కావాల్సిన పదార్థాలు :

గుడ్లు – నాలుగు
పెరుగు – నాలుగు స్పూన్లు
శెనగపిండి – రెండు స్పూన్లు
నూనె – రెండు స్పూన్లు
కారం – అర స్పూను
నిమ్మరసం – ఒక స్పూను
చాట్ మసాలా – అర టీస్పూను
తందూరీ మసాలా – ఒక స్పూను
ఉప్పు – రుచికి సరిపడా

తయారీ విధానం :

ఇందుకోసం ఒక గిన్నెలో పెరుగు, శెనగపిండి, నిమ్మరసం, కారం, తందూరి మసాలా, ఉప్పు వేసి బాగా కలపాలి. ఉడికించిన గుడ్లను సగానికి రెండు ముక్కలుగా చేసి పైన కలిపిన మిశ్రమంలో మారినేట్ చేయాలి. గ్రిల్ పాన్‌లో ఒక స్పూను నూనె వేసి వేడి చేయాలి. ఇప్పుడు ఆ పాన్‌లో మారినేట్ చేసిన గుడ్లను వేసి వేయించాలి. ఓవెన్లో వండే వాళ్లు 180 డిగ్రీల సెల్సియస్ వద్ద పది నిమిషాల పాటూ గుడ్లను గ్రిల్ చేయాలి. గుడ్లు బాగా వేగాక పైన చాట్ మసాలా, కొత్తిమీర చల్లి సర్వ్ చేసుకోవాలి.