Site icon HashtagU Telugu

De-tan Packs: కాంతివంతమైన చర్మం మీ సొంతం అవ్వాలంటే ఈ ఒక్క ప్యాక్ వేస్తే చాలు?

Mixcollage 06 Feb 2024 08 23 Pm 300

Mixcollage 06 Feb 2024 08 23 Pm 300

మాములుగా టాన్‌ కారణం ముఖం, ఇతర శరీరం భాగాలు నల్గగా, అందవిహీనంగా, నిర్జీవంగా మారతాయి. ట్యానింగ్ అనేది చర్మం తనని తాను రక్షించుకునే ఒక ప్రక్రియ. సూర్యుడని నుంచి వచ్చే యూవీ రేడియేషన్‌ నుంచి మన చర్మాన్ని రక్షించడానికి శరీరంలో ఉండే మెలనిన్‌ చర్మ కణాల ఉపరితలంపైకి బదిలీ అవుతుంది. మెలనిన్ చేరటం వల్ల సూర్యరశ్మికి గురయ్యే ప్రదేశాల్లో టాన్‌ గమనించవచ్చు. టాన్‌ కారణంగా ముఖం, ఇతర శరీర భాగాలు నల్లగా, నిర్జీవంగా కనిపిస్తాయి. ఇంట్లోనే‌ టాన్‌ను తొలగించి, తిరిగి ప్రకాశవంతమైన చర్మాన్ని చాలా ఉంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే మీరు కూడా అలా ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తున్నారా. ఇకమీదట అవేమీ అక్కర్లేదు.

కొన్ని సింపుల్ చిట్కాలను పాటిస్తే చాలు కాంతివంతమైన చర్మం మీ సొంతం అవ్వడం ఖాయం. పసుపులో అధిక యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉంటాయి. ఇవి పిగ్మెంటేషన్, డార్క్ స్పాట్‌లను తగ్గించడానికి సహాయపడతాయి. పాలులోని సుగుణాలు యూవీ కిరణాల ప్రభావాలను తిప్పికొట్టడానికి సహాయపడతాయి, చర్మాన్ని ప్రకాశవంతంగా ఉంచుతాయి. చర్మంపై టాన్‌ను తొలగించడానికి స్పూన్‌ పసుపు, రెండు టేబుల్‌ స్పూన్ల పాలు, తేనె తీసుకుని పేస్ట్‌లా తయారు చేయాలి. టాన్‌ ఎఫెక్ట్‌ అయిన ప్రదేశాలలో దీన్ని మాస్క్‌లా అప్లై చేయాలి. దీన్ని 15 నిమిషాల పాటు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే చాలు టాన్‌ తొలగి, ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. బొప్పాయి లోని ఎంజైమ్‌లు డెడ్ స్కిన్‌ని తొలగించి డార్క్ స్పాట్స్‌ని తగ్గిస్తాయి.

దీనిలో బీటా కెరోటిన్‌ ఉంటుంది. ఇది ప్రకాశవంతమైన చర్మాన్ని అందించడానికి ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. చర్మానికి తేమను అందిస్తుంది. ఈ డీటాన్‌ ప్యాక్‌ తయారు చేయడానికి బాగా పండిన బొప్పాయి ముక్కను పేస్ట్‌ చేయాలి. దీనిలో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె వేసి బాగా మిక్స్‌ చేయాలి. ఈ మాస్క్‌ను ముఖం, మెడ, చేతులకు అప్లై చేసి 15 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే కాంతివంతమైన చర్మం మీ సొంతం అవుతుంది. గ్రీన్ టీలో ఉండే ఫ్లేవనాయిడ్స్‌, యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతిని పునరుద్ధరించడానికి సహాయపడతాయి. గ్రీన్ టీని మీ బ్యూటీ కేర్‌లో యాడ్‌ చేసుకుంటే నల్ల మచ్చలు, హైపర్‌పిగ్మెంటేషన్‌ వంటి సమస్యలు దూరం అవుతాయి.

డార్క్‌ సర్కిల్స్‌ సమస్యను దూరం చేయడానికి గ్రీన్‌ టీ బ్యాగ్‌లను కళ్లపై ఉంచుకోండి. గ్రీన్ టీని నీటిలో మరిగించి చల్లారనివ్వాలి. ఈ నీళ్లలో కాటన్‌ ముంచి టాన్‌ ఉన్న ప్రాంతంలో అప్లై చేయండి. దీన్ని 7 నుంచి 8 నిమిషాల పాటు ఆరనివ్వండి. ఆ తర్వాత నీళ్లతో ముఖం శుభ్రం చేసుకోండి. ఇలా తరచు చేస్తూ ఉంటే టాన్‌ తొలగిపోతుంది. అదేవిధంగా టాన్‌ తొలగించడానికి యాపిల్‌, బార్లీ ప్యాక్‌ ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. ఈ ప్యాక్‌ చేయడానికి ముందుగా యాపిల్‌ని మిక్సీలో వేసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ పేస్ట్‌ని ఒక కప్పులో తీసుకొని అందులో ఒక టేబుల్‌ స్పూన్‌ తేనె, ఒక టేబుల్‌ స్పూన్‌ బార్లీ పిండి కలిపి మిక్స్‌ చేయాలి. ఈ పేస్ట్‌ను టాన్‌ ఉన్న ప్రదేశంలో అప్లై చేయాలి. దీన్ని 20 నిమిషాల పాటు ఆరనిచ్చి శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండుసార్లు చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి..