Site icon HashtagU Telugu

Tamarind Seed Benefits : చింతగింజలు పడేస్తున్నారా..? అయితే మీరు పెద్ద తప్పుచేస్తున్నట్లే..!!

Tamarind Seed Benefits

Tamarind Seed Benefits

వేసవి కాలం వచ్చిందంటే చాలు పల్లెల్లో చాలామంది మహిళలు గుంపులుగా చెట్ల కింద కుర్చీని చింత గింజ(Tamarind Seed )ను తీస్తుంటారు. ఆలా గంటల కొద్దీ ముచ్చటపెడుతూ చింతగింజలను తీసీ..ఆ గింజలను బయటపారేస్తుంటారు. కానీ అక్కడే మీరు పెద్ద తప్పు చేస్తున్నారు. చింత పండుకంటే చింత గింజలతోనే ఎక్కువ ప్రయోజనం (Tamarind Seed Benefits) ఉంది. చింతకాయలోఎన్ని ఔషధగుణాలు ఉన్నాయో అంతకంటే ఎక్కువ చింత గింజల్లో ప్రొటీన్స్, ఎమినో యాసిడ్స్, ఫ్యాటి యాసిడ్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ విత్తనాలు అనేక రకాల వ్యాధులు, ఇన్ఫెక్షన్లను సమర్థవంతంగా నివారిస్తాయి. మొదట చింతగింజలను వేయించిన తర్వాత పొడి చేసుకోవాలి.పొడిని గాజు సీసాలో నిల్వ ఉంచుకోని రోజుకు రెండుసార్లు అరటీస్పూన్‌ చొప్పున పాలు లేదా నీటితో చక్కెర కలిపి తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది.

We’re now on WhatsApp. Click to Join.

చింతగింజల పొడిని ఒక గ్లాసు నీటిలో టీస్పూన్ కలిపి రోజుకి రెండుసార్లు తాగితే ఆర్థరైటిస్ లక్షణాల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. దాంతో కీళ్ల నొప్పులు తగ్గుతాయి.చింత పొడిని గోరువెచ్చని నీటిలో కలిపి మౌత్‌వాష్‌లా ఉపయోగిస్తే నోటి దుర్వాసన తొలగిపోతుంది. చింతపండు విత్తనాల్లో యాంటీ క్యాన్సర్ గుణాలుంటాయి.క్యాన్సర్ ను నివారించడమే కాకుండా కోలన్ క్యాన్సర్ రిస్క్ ని తగ్గిస్తాయి.ఇందులో ఉండే డైటరీ ఫైబర్ వల్ల కొలెస్ట్రాల్ కూడా తగ్గుతుంది. ఇది జీర్ణ వ్యవస్థని కూడా మెరుగు పరుస్తుంది.చింత గింజల్లో ఉండే పొటాషియం రక్తప్రసరణను మెరుగుపరిచి గుండె సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి చింతగింజలు దివ్య ఔషధం. ముందుగా కొన్ని చింత గింజ‌ల‌ను తీసుకుని వాటిని బాగా వేయించాలి. అనంత‌రం 2 రోజుల పాటు వాటిని నీటిలో నాన‌బెట్టాలి. రోజుకు రెండు సార్లు నీటిని మార్చాలి. 2 రోజుల త‌రువాత చింత గింజ‌ల‌ను తీసి వాటి పొట్టును వేరు చేయాలి. అనంత‌రం వ‌చ్చే విత్త‌నాల‌ను చిన్న చిన్న ముక్క‌లుగా చేసి నీడ‌లో ఎండ‌బెట్టాలి. అలా ఎండిన ముక్క‌ల‌ను తీసుకుని మిక్సీలో వేసి పొడిగా ప‌ట్టాలి. ఆ పొడిని జార్‌లో నిల్వ చేసుకోవాలి. దీన్ని అర టీస్పూన్ మోతాదులో తీసుకుని రోజుకు రెండు సార్లు నీటితో లేదా పాల‌తో నెయ్యి లేదా చ‌క్కెర‌ను క‌లిపి తీసుకోవాలి.

ఇలా చేయడం వలన మోకాళ్ల నొప్పుల నుంచి వెంట‌నే ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. అంతేకాదు 3-4 వారాల్లో స‌మ‌స్య పూర్తిగా తగ్గుముఖం ప‌డుతుంది. చింత గింజ‌ల్లో ఉండే ఔష‌ధ పదార్థాలు ఎముక‌ల‌కు బ‌లాన్నిస్తాయి. అదేవిధంగా కీళ్ల‌లో అరిగిపోయిన గుజ్జును మ‌ళ్లీ ఉత్పత్తి చేస్తాయి. దీంతో కీళ్ల నొప్పుల నుంచి శాశ్వ‌తంగా విముక్తి ల‌భిస్తుంది. అందుకే చింతగింజలకు మార్కెట్ లో భారీ ధర పలుకుతాయి. కేజీ రూ.50 ల వరకు పలుకుతుంది. అందుకే ఇకపై చింతగింజలను సింపుల్ గా తీసి పడేయకండి..దాచిపెట్టి అమ్మడం కానీ పైన చెప్పిన విధంగా కానీ చెయ్యండి.

Read Also : Men Turn Women : ఆ గ్రామంలో హోలీ వచ్చిందంటే చాలు..మగవారు..మహిళలుగా మారతారు..

Exit mobile version