Site icon HashtagU Telugu

Tamarind Onion Chutney: చింతపండు ఉల్లిపాయ చట్నీ.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 28 Dec 2023 03 39 Pm 1803

Mixcollage 28 Dec 2023 03 39 Pm 1803

మామూలుగా మనం ఎన్నో రకాల చట్నీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం. పల్లీ చట్నీ, టమోటా చట్నీ,వంకాయ చట్నీ, కొత్తిమీర చట్నీ, పుదీనా చట్నీ ఇలా ఎన్నో రకాల చట్నీలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. అయితే ఎప్పుడైనా చింతపండు ఉల్లిపాయ చట్నీ తిన్నారా. ఎప్పుడూ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

చింతపండు ఉల్లిపాయ చట్నీకి కావాల్సిన పదార్థాలు:

ఉల్లిపాయ -1 పెద్ద సైజులో ఉండాలి.
చింతపండ్లు – 100గ్రాములు
చక్కెర -1 స్పూన్
నల్ల ఉప్పు – రుచికి సరిపడా
కారం -1 స్పూన్
నల్ల మిరియాల పొడి – చిటికెడు
జీలకర్ర – 1/2టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి -1
కొత్తమీర – కొద్దిగా

చింతపండు ఉల్లిపాయ చట్నీ తయారీ విధానం:

ముందుగా చింతపండును వేడి నీళ్లలో 2 గంటలు నానబెట్టాలి. దీని తరువాత, ఒక జల్లెడ ద్వారా ఫిల్టర్ చేసి గుజ్జును తీసివేసి నీటిని వేరు చెయ్యాలి. తర్వాత గుజ్జులో ఉల్లిపాయలు, వేసి గ్రైండ్ చెయ్యాలి. అందులో ఎర్ర కారం, నల్ల ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి, కొన్ని ఎండుమిర్చి, కొద్దిగా చక్కెర వేసి దగ్గరకు వచ్చే వరకు మరగించాలి. తర్వాత స్టౌమీద ఒక బాణలి పెట్టి అందులో కొంచెం నూనె పోసి వేడి అయ్యాక జీలకర్ర, ఆవాలు,పసుపు వేసి పోపు పెట్టాలి. తర్వాత అందులో సన్నగా తరిగిన పచ్చిమిర్చి, సన్నగా తరిగిన ఉల్లిపాయలు, పచ్చి కొత్తిమీర కలపితే టేస్టీ చట్నీ రెడీ.