Site icon HashtagU Telugu

Tamannaah Beauty Secret: మిల్కీ బ్యూటీ తమన్నా స్కిన్ మెరుపు సీక్రెట్ ఇదే…మీరు ఫాలో అయిపోండి…

tamannaah

tamannaah

అందాల తార మిల్కీ తమన్నా అంటే అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా విపరీతంగా అభిమానిస్తారు. తమన్నా గత రెండు దశాబ్దాలుగా టాలివుడ్, బాలివుడ్ సినిమాల్లో రాణిస్తోంది. అమ్మడి బ్యూటీ మాత్రం ఏ మాత్రం తగ్గడం లేదు. తమన్నా మేని ఛాయలో ఓ మెరుపు ఉంటుందని అంతా అంటారు. మరి అందాల తమన్నా తన బ్యూటీ సీక్రెట్స్ ను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టేసింది. మరి అవేంటో చూద్దామా.

తమన్నా భాటియా స్కిన్ కేర్ చిట్కాలు చాలా సింపుల అనే చెప్పాలి., తమన్నా తన స్కిన్ మెరుపు కోసం ఉదయం వేళ శుభ్రమైన నీటితో ఎలాంటి సొల్యూషన్ వాడకుండా కడుగుతుందట. ఈ విషయాన్ని ఆమె ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఆ తర్వాత తన స్కిన్ ఆయిలీ స్కిన్ అని చెప్పిన తమ్మూ బేబి. మొఖానికి రెండు చుక్కల సీరం రాసుకుంటుందట, అలాగే తన కళ్ల కింద వలయాలు రాకుండా, ఐస్ క్యూబ్స్, అలాగే గ్రీన్ టీ బ్యాగులను (వాడినవి) పెట్టుకుంటుందట. అలా చేయడం వల్ల తమన్నా కంటి కింద వలయాలు మాయం అవుతాయట.

మొటిమల సమస్యపై తమన్నా టిప్స్:
అందరిలాగే నటి తమన్నా భాటియా కూడా మొటిమల సమస్యతో ఇబ్బంది పడ్డారట. మచ్చల ద్వారా మొఖం అందాన్ని కోల్పోతుందనే చింత ఆమెకు నిద్ర లేకుండా చేసిందట. కానీ దీని కోసం, ఆమె మొటిమలు మీద ఉదయం తన లాలాజలాన్ని రాసుకుంటుందట. ఇది మొటిమలను పొడిగా చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటుందట. పైగా చాలా బాగా పని చేస్తుందని తెలిపారు. =

తమన్నా హెయిర్ కేర్: స్ట్రాంగ్ హెయిర్ కోసం తమన్నా హెయిర్ కేర్ సీక్రెట్
ఒక నటికి అందమైన ముఖంతో పాటు జుట్టు కూడా ముఖ్యం. అనేక హెయిర్ ప్రాడక్ట్స్ జుట్టుకు హాని కలిగిస్తుంటాయి. అందుకే జుట్టు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. తమన్నా తన జుట్టుకు కొబ్బరి నూనెను ఉపయోగిస్తుంది. ఇది జుట్టును బలపరుస్తుంది. మృదువుగా మెరిసేలా చేస్తుంది. దీనితో పాటు, ఆమె ఉల్లిపాయ రసాన్ని కూడా తలకు పట్టిస్తారట.

చర్మ సమస్యలు పదే పదే వేధిస్తుంటే వైద్యులను సంప్రదించడం మంచిదని నటి తమన్నా భాటియా అన్నారు. డాక్టర్ మీ చర్మ సంబంధిత సమస్యకు ఖచ్చితమైన కారణాన్ని కనుగొని సరైన పరిష్కారాన్ని సూచించగలరని ఆమె పేర్కొన్నారు.