Site icon HashtagU Telugu

Tamalapaku Laddu: తీయని తమలపాకు లడ్డు ఎప్పుడైనా తిన్నారా.. అయితే ఇలా ట్రై చేయండి?

Tamalapaku Laddu

Tamalapaku Laddu

చాలామంది స్వీట్లలో ఎక్కువగా ఇష్టపడే స్వీట్ ఏందంటే లడ్డు అని చెబుతూ ఉంటారు. లడ్డులో ఎన్నో రకాల లడ్లు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. బందర్ లడ్డు, నేతి లడ్డు, డ్రై ఫ్రూట్ లడ్డు ఎన్నో రకాల లడ్లు మనం తినే ఉంటాం. వాటిని తినకపోయినా వాటి పేర్లు అయినా విని ఉంటాం. కానీ ఎప్పుడైనా మీరు తమలపాకు లడ్డు తిన్నారా. చాలామంది తినడం కాదు కదా ఈ పేరుని విని కూడా ఉండరు. మరి తమలపాకు లడ్డు ఏ విధంగా ఉంటుంది దానిని ఎలా తయారు చేసుకోవాలి? ఏ పదార్థాలు కావాలో ఎప్పుడు మనం తెలుసుకుందాం…

ముందుగా తమలపాకు లడ్డుకు కావలసిన పదార్థాలు.
తమలపాకులు – 20
శనగపిండి –250 గ్రాములు
బేకింగ్‌ సోడా – కొద్దిగా
జీడిపప్పు, కిస్మిస్‌
పంచదార – 400 గ్రాములు
నూనె – డీప్‌ఫ్రైకి సరిపడా
ఫుడ్‌ కలర్‌ – కొద్దిగా

తయారీ విధానం :
ముందుగా తమలపాకులు కాడ లేకుండా ఇరవై ఆకులు తీసుకుని అందులో కొన్ని నీరు పోసుకుని మిక్సీ పట్టుకుని పలుచటి క్లాత్‌లో వేసుకుని రసం మాత్రమే ఒక బౌల్లోకి తీసుకోవాలి. తర్వాత శనగపిండిలో బేకింగ్‌ సోడా, తమలపాకుల రసం వేసుకుని హ్యాండ్‌ బ్లండర్‌తో బాగా కలుపుకోవాలి.
అందులో కొద్దిగా గ్రీన్‌ ఫుడ్‌ కలర్‌ వేసుకుని మరికాస్త నీళ్లు పోసుకుని పలుచగా చేసుకోవాలి. తర్వాత కడాయిలో నూనె వేడి చేసుకుని అందులో జల్లెడ సాయంతో తమలపాకు మిశ్రమాన్ని వేసుకుంటూ చిన్న బూందీలా వేయించుకోవాలి. ఆ తర్వాత పంచదార పాకం పెట్టుకుని అందులో కూడా కొద్దిగా ఫుడ్‌ కలర్‌ కలుపుకునితీగపాకం మొదలయ్యే సమయంలో తమలపాకు బూందీని వేసుకుంటూ బాగా కలపాలి. జీడిపప్పు, కిస్మిస్‌లను అందులో వేసుకుని దగ్గర పడేదాకా చిన్న మంట మీద ఉడకనిచ్చి స్టవ్‌ ఆఫ్‌ చేసుకోవాలి. కాస్త చల్లారాక లడ్డూ ల్లాగా చుట్టు కోవాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే తమలపాకు లడ్డు రెడీ.