Healthy Skin: అందమైన చర్మం కావాలంటే ఈ ఆహారం తినాల్సిందే.. ఇదిగో లిస్ట్ ఇదే!

అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. అయితే అందమైన చర్మం కోసం రకరకాల సోపులు,

  • Written By:
  • Publish Date - August 11, 2022 / 07:30 AM IST

అందమైన, ఆరోగ్యమైన చర్మాన్ని ప్రతి ఒక్కరూ కోరుకుంటుంటారు. అయితే అందమైన చర్మం కోసం రకరకాల సోపులు, షాంపూలు, ఫేస్ ప్యాక్ లు ఉపయోగించుకుంటూ ఉంటారు. ఇంకొంతమంది అయితే వారి అందానికి మేకప్ తో కవర్ చేస్తూ ఉంటారు. అయితే ఇలా ఫేస్ ప్యాక్ లు క్రీములు కాకుండా మనం తినే ఆహారంలోనే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే మెరిసే చర్మం ఉండవచ్చు. మరి ముఖంపై ఏర్పడే మధ్యలో మొటిమలు పోయి చర్మం కాంతివంతంగా కనిపించాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..

పాల‌‌‌‌కూర‌‌: పాలకూరలో విటమిన్‌‌ ఎ, బీటా కెరటిన్‌‌లు పుష్కలంగా లభిస్తాయి. ఇవి చర్మాన్ని యవ్వనంగా నిగనిగలాడేలా చేస్తాయి. పాల‌‌కూర‌‌ను రోజూ ఆహారంలో తీసుకుంటే నలభై ఏళ్ళ వయసులో కూడా చర్మం మెరుస్తూ కనిపిస్తుంది.

క్యారెట్స్: విటమిన్ ఎ అధికంగా ఉండే క్యారెట్స్ తినడం వల్ల కళ్లు, చర్మానికి చాలా మంచిది. వీటిని రోజూ తినడం వల్ల ఇన్‌‌ఫెక్షన్​లు దరిచేరవు. ఇందులో ఉండే బీటా కెరటిన్‌‌ మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడంతో పాటు చర్మాన్ని, జుట్టుని ఆరోగ్యంగా ఉంచుతుంది.

విటమిన్​ బి- 6: విటమిన్‌‌-బి6 ఎక్కువగా ఉండే క్యారెట్‌‌, కాలీఫ్లవర్, పొద్దుతిరుగుడు గింజల నూనె, వాల్‌‌నట్స్, అవకాడో హార్మోన్లలోని తేడాల వల్ల వచ్చే మొటిమలను నివారిస్తాయి.

బొప్పాయి: బొప్పాయిలో విటమిన్-సి, ఇ , బీటాకెరోటిన్ అధికంగా ఉంటాయి. వీటిని తరచుగా తీసుకోవడం వల్ల చర్మం పై ఉండే డెడ్​ స్కిన్​ సెల్స్​ దూరమై అందంగా మారతారు.

ఒమేగా 3 ఫ్యాటీ: చేపలు, సోయా ఉత్పత్తు ల్లో ఒమెగా 3 ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రెగ్యులర్​గా తీసుకోవడం వల్ల ఒత్తిడి, కుంగుబాటు, డిప్రెషన్ లాంటివి దూరమవుతాయి. చర్మం తాజాగా నిగనిగలాడుతుంటుంది.

యాంటీ ఆక్సిడెంట్స్​: యాపిల్, అరటి, నారింజ, జామ వంటి అన్ని రకాల తాజా పండ్లలో అన్ని రకాల విటమిన్లతో పాటు యాంటీ ఆక్సిడెంట్స్‌‌ ఉంటాయి. ఇవి చర్మాన్ని ముడతలు పడేలా చేసే ఫ్రీ–రాడికల్స్‌‌ను తొలగిస్తాయి. అందుకే చర్మం యవ్వనంగా ఉండాలంటే ఈ పండ్లు తినాలి.

బాదం పప్పు: బాదంపప్పు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు అందానికి కూడా బాగా ఉపయోగపడుతుంది. విటమిన్‌-ఇ, యాంటీ ఆక్సిడెంట్లు బాదం ప‌‌ప్పుల్లో పుష్కలంగా ఉంటాయి. రోజూ 4బాదం పప్పుల్ని రాత్రంతా నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే మంచిది.