Site icon HashtagU Telugu

Oral Cancer Symptoms: నోటికి క్యాన్సర్ వస్తే బయటపడే లక్షణాలివీ

Oral Cancer

Oral Cancer

గత 10 సంవత్సరాలలో నోటి క్యాన్సర్ (Oral Cancer) కేసులలో మూడింట ఒక వంతు కంటే ఎక్కువ పెరుగుదల ఉంది. ఈ క్యాన్సర్ పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గల లోపలి పొర, నోటి పైభాగం, నాలుక కింద సహా నోటిలోని ఏదైనా భాగంలో నోటి క్యాన్సర్ అభివృద్ధి చెందుతుంది.పొగాకు వినియోగం నోటి క్యాన్సర్‌కు (Oral Cancer) ప్రధాన కారకంగా ఉంది. గుట్కా, జర్దా, ఖైనీ, సిగరెట్, బీడీ, హుక్కా ఇలా అన్నీ పొగాకులో ఉండడం వల్ల క్యాన్సర్ కణితి పెరుగుతుంది.  చిన్నాపెద్దా, వృద్ధాప్య వర్గాల వారు దీని బారిన పడుతారు.

నోటి క్యాన్సర్ (Oral Cancer) లక్షణాలు, సమస్యలు

  1. మీ గొంతులో ఏదో ఇరుక్కు పోయినట్లు లేదా గొంతు నొప్పిగా ఉన్నట్లు మీరు నిరంతరంగా భావించినట్లయితే, వెంటనే వైద్యుడిని సంప్రదించాలి.
  2. ఏ కారణం లేకుండా నోరు మరియు ముఖం మీద నొప్పి, తిమ్మిరి ఉంటే అది నోటి క్యాన్సర్‌కు సంకేతం. ఈ స్థితిలో దవడలో వాపు మరియు నొప్పి కూడా ఉండవచ్చు.
  3. పెదవులు, చిగుళ్ళు, నాలుక, బుగ్గ లోపలి పొర,నోటి పైభాగం లేదా కింది భాగంలో ఇలా ఎక్కడనా క్యాన్సర్ రావొచ్చు.

పళ్ళు పచ్చగా..

నోటి క్యాన్సర్ అనేది నమలడం, మింగడం, మాట్లాడడంలో ఇబ్బందిని సూచిస్తుంది. ఈ సమస్య ఉన్నప్పుడు మంటగా, ఇబ్బందిగా ఉంటుంది. దంతాలపై ఎనామెల్ తగ్గుతుంది. దీంతో రంగు మారి పలుచగా అయి దంతాల సమస్యలు వస్తాయి. ఈ కారణంగా పళ్ళు పచ్చగా మారతాయి. కొన్నిసార్లు నోటి నుంచి దుర్వాసన కూడా వస్తుంది.

తెల్లటి పాచెస్..

చిగుళ్ళు, నాలుక, టాన్సిల్స్ లేదా నోటిపై ఎరుపు లేదా తెలుపు మందపాటి మచ్చలు కనిపించడం ప్రమాదకరం. ఈ పరిస్థితిని ల్యూకోప్లాకియా అంటారు. చాలా ల్యూకోప్లాకియా పాచెస్ క్యాన్సర్ లేనివి. అయినప్పటికీ, అనేక క్యాన్సర్ల ప్రారంభ లక్షణాలు ఉండవచ్చు. పొగాకు ఉత్పత్తుల వినియోగం వల్ల ఇవి రావచ్చు. ఎవరైనా అలాంటి సంకేతాలను చూసినట్లయితే, ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి.

నోటిలో గడ్డలు

నోటిలో లేదా శోషరస గ్రంధులలో (మెడ శోషరస గ్రంథి) ఏదైనా రకమైన ముద్ద ఉన్నట్లు అనిపిస్తే అది ప్రమాదకరం.

గుర్తింపు, చికిత్స ఇలా..

నోటి క్యాన్సర్‌ని గుర్తించేందుకు బయాప్సీ, ఇమేజింగ్ అంటే సిటీ స్కాన్, ఎమ్‌ఆర్ఐ చేస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గనుక క్యాన్సర్ ఉన్నట్లు తేలితే, క్యాన్సర్ రకం, స్టేజ్‌ని బట్టి ట్రీట్‌మెంట్ ఉంటుంది.నోటి క్యాన్సర్ గుర్తిస్తే సర్జరీ, రేడియేషన్ థెరపీతో ట్రీట్‌మెంట్ చేస్తారు. ఉదాహరణకు రేడియేషన్ థెరపీ, కీమోథెరపీ ఒకేసారి చేస్తారు. ట్రీట్‌మెంట్ అనేది మీ హెల్త్‌పై ఆధారపడి ఉంటుంది. మీ నోరు, గొంతులో క్యాన్సర్ ఎక్కడ ఉంది. కణితి పరిమాణం, రకం వంటిని చూసి ట్రీట్మెంట్ ఇస్తారు.

Also Read:  Artificial Pancreas: కృత్రిమ ప్యాంక్రియాస్‌ తో ప్రయోగం సక్సెస్

Exit mobile version