Heart Attack Symptoms: జిమ్ లో ఇటువంటి తప్పులు చేస్తున్నారా.. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం ఎక్కువ?

ఈ మధ్యకాలంలో జిమ్లో వర్కౌట్స్ చేస్తూ, వర్కౌట్ చేసిన తర్వాత ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విధంగా

  • Written By:
  • Updated On - November 15, 2022 / 12:08 PM IST

ఈ మధ్యకాలంలో జిమ్లో వర్కౌట్స్ చేస్తూ, వర్కౌట్ చేసిన తర్వాత ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ విధంగా నెలలో కనీసం వంద మందిలో పదిమంది అయినా ఈ విధంగా జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ మరణిస్తున్నారు. బాలీవుడ్ నటుడు సిద్ధార్థ శుక్ల అలాగే కన్నడ హీరో పునీత్ రాజ్ కుమార్ లు కూడా ఈ విధంగా మరణించిన విషయం తెలిసిందే.

అయితే గత కొంతకాలంగా జిమ్ లో వ్యాయామం వర్కౌట్స్ చేస్తూ అకస్మాత్తుగా మరణించే వారి సంఖ్య అంతకంతకు పెరుగుతుంది. అయితే ఇలా మరణించిన వారందరూ కూడా ఇంచుమించు జిమ్ ఎఫెక్ట్ తో చనిపోయారు అని చెప్పవచ్చు. మరి వ్యాయామం సమయంలో గుండెపోటు రాకుండా ఉండాలి అంటే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సాధారణంగా గుండెకు రక్త ప్రసరణ సమయంలో ఏమైనా అడ్డంకులు ఏర్పడినప్పుడు గుండెపోటు వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు గుండె కండరాలలో కొంత భాగానికి ఆక్సిజన్ ను అధికంగా ఉండే రక్త ప్రవాహం మందగిస్తుంది. అటువంటి పరిస్థితులలో రక్తం వీలైనంత త్వరగా సాధారణ స్థితికి రాకపోతే కండరాలలో ఆక్సిజన్ తగ్గి గుండె కండరాలు విఫలం కావడం ఫలితంగా గుండె కొట్టుకోవడం ఆగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటాయి. వ్యాయామం చేసేటప్పుడు గుండెపోటు ఎందుకు వస్తుంది అన్న విషయానికి వస్తే.. వ్యాయామం చేసేటప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి శారీరక సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వ్యాయామం చేయాలి. కొంతమంది శారీరక సామర్థ్యం తక్కువగా ఉన్నప్పటికీ జిమ్ లో అతిగా వ్యాయామం చేస్తూ ఉంటారు. ఈ విధంగా చేయడం వల్ల అది మీ హృదయాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది.

ఎటువంటి వారికి గుండె జబ్బులు వస్తాయి అన్న విషయానికొస్తే.. గుండె జబ్బులు రావడం అన్నది వారి వయసు మీద ఆధారపడి ఉంటుంది. తరచూ వ్యాయామం చేసే యుక్త వయసు వారికి గుండె జబ్బులు వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. అలాగే రోజు వ్యాయామం చేసే వృద్ధులకు గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. వ్యాయామం చేసేటప్పుడు కొందరు కండలు తిరిగిన శరీరాన్ని నిర్మించుకోవడం కోసం హెవీ వెయిట్ ట్రైనింగ్ ప్రారంభిస్తూ ఉంటారు. ఆ విధంగా చేయడం వల్ల అటువంటి వారు అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అటువంటి వారు జిమ్‌కి వెళ్లిన వెంటనే హెవీ వెయిట్‌ ట్రైనింగ్ కి బదులుగా ఒక గోల్‌ వేసుకుని, ఆ లక్ష్యం వైపు నెమ్మదిగా పని చేయండి. ముందుగానే ఆ హెవీ వెయిట్ ‌లిఫ్ట్ చేయడం అంత మంచిది కాదు.