Swollen Feet : పాదాల్లో వాపు అనేది చాలా మందికి ఎదురయ్యే ఒక సాధారణ ఆరోగ్య సమస్య. ఎక్కువగా ఇది అలసట, ఎక్కువసేపు నిలబడి ఉండటం లేదా కూర్చోడం వంటివి కారణాలవల్ల వస్తుంది. అయితే నిపుణుల హెచ్చరిక ఏమిటంటే ఇది తరచూ కనిపిస్తే మాత్రం చిన్నగా తీసుకోవడం ప్రమాదకరం. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో ఇది తీవ్రమైన ఆరోగ్య సమస్యల సంకేతంగా మారవచ్చు. విశ్రాంతి తీసుకున్నా లేదా రాత్రి నిద్రల అనంతరం కూడా వాపు తగ్గకపోతే, ఇది శరీరంలో ఏదో తేడా జరిగిందన్న సంకేతంగా చూడాలి. ముఖ్యంగా వాపుతో పాటు ఇతర లక్షణాలు కూడా ఉంటే, వైద్యుడిని సంప్రదించాల్సిన అవసరం ఉంది.
పాదాల వాపుకు సాధారణ కారణాలు..
. ఎక్కువ సేపు నిలబడి ఉండటం లేదా కూర్చోవడం – రక్త ప్రసరణ సరిగా జరగకపోవడం వల్ల నీరు కాళ్లలో పేరుకుపోయి వాపు కలిగించవచ్చు.
. గర్భధారణ – గర్భాశయంపై ఒత్తిడి, శరీరంలోని ద్రవాల పెరుగుదల వల్ల వాపు సాధారణం.
. అధిక బరువు – ఊబకాయం వల్ల పాదాలపై ఎక్కువ ఒత్తిడి పడుతుంది.
. గాయాలు – కాలు లేదా చీలమండలకు గాయం జరిగితే ఆ ప్రాంతంలో వాపు ఏర్పడుతుంది.
. ఔషధాలు – రక్తపోటు మందులు, స్టెరాయిడ్లు, హార్మోన్ల మందులు వాపును కలిగించవచ్చు.
. మితిమీరిన ఉప్పు సేవనం – శరీరంలో నీరు నిలిచి ఉండటానికి కారణమవుతుంది.
. ఈ కారణాలు తాత్కాలికమైనవే కావచ్చు. వాటికి సరైన విశ్రాంతి, ఆహార నియమాలు పాటిస్తే సమస్య తేలికగా పరిష్కారమవుతుంది.
గమనించాల్సిన తీవ్రమైన కారణాలు..
. గుండె సమస్యలు (Heart Failure) – గుండె రక్తాన్ని సరిగా పంపించలేకపోతే, కాళ్లలో రక్తం నిలిచి వాపు వస్తుంది. దీనితో . . . పాటు శ్వాసలో ఇబ్బంది, అలసట ఉంటే వెంటనే జాగ్రత్తగా ఉండాలి.
. కిడ్నీ వ్యాధులు – కిడ్నీలు సరైన రీతిలో పనిచేయకపోతే శరీరంలో ద్రవాలు నిలిచిపోతాయి. కాళ్లతో పాటు కళ్ల చుట్టూ కూడా వాపు వస్తుంది.
. కాలేయ సమస్యలు – కాలేయం ప్రోటీన్లు సరిగ్గా ఉత్పత్తి చేయకపోతే శరీర కణజాలాల్లో నీరు పేరుకుపోతుంది. దీనివల్ల పాదాలు, పొత్తికడుపులో వాపు ఏర్పడుతుంది.
. హైపోథైరాయిడిజం – థైరాయిడ్ గ్రంథి తక్కువగా పనిచేసినప్పుడు జీవక్రియ నెమ్మదిస్తుంది, ద్రవాలు పేరుకుపోతాయి.
. DVT (Deep Vein Thrombosis) – లోతైన సిరల్లో రక్తం గడ్డకట్టడం వల్ల వాపుతో పాటు నొప్పి, ఎరుపు కనిపిస్తాయి. ఇది అత్యవసర వైద్య పరిష్కారం కావాల్సిన పరిస్థితి.
. లింఫెడెమా – లింఫాటిక్ వ్యవస్థ సమస్యల వల్ల ఒకవేళ కాళ్లలో నీరు నిలిచిపోతే నిరంతరం వాపు ఏర్పడుతుంది.
. వెరికోస్ వీన్లు – కాళ్లలోని సిరల పనితీరు తగ్గినప్పుడు రక్తం తిరిగి గుండెకు వెళ్లకుండా పేరుకుపోతుంది.
వెండటైన్ వైద్యుడిని సంప్రదించాల్సిన పరిస్థితులు:
. వాపు ఆకస్మికంగా వచ్చి వేగంగా పెరగడం
. వాపుతో పాటు నొప్పి, మంట లేదా ఎరుపు కనిపించడం
. ఒక కాలులో మాత్రమే ఎక్కువ వాపు ఉండడం
. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, ఛాతీలో నొప్పి
. గర్భధారణ సమయంలో అకస్మాత్తుగా వాపు పెరగడం
పాదాల వాపును చిన్నగా చూడకండి. తరచూ వాపు రావడం ఆరోగ్య సమస్యకు సంకేతంగా ఉండే అవకాశముంది. జీవితశైలి మార్పులు, సరైన ఆహారం, శరీరానికి తగిన వ్యాయామం, వైద్య సలహాలతో ఈ సమస్యను సమర్ధవంతంగా ఎదుర్కోవచ్చు. చిన్న లక్షణాలను లైట్ తీసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమం.