Site icon HashtagU Telugu

Sweet Pulao: స్వీట్ పులావ్.. ఇలా చేస్తే చాలు లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

Mixcollage 11 Feb 2024 08 45 Pm 599

Mixcollage 11 Feb 2024 08 45 Pm 599

మామూలుగా మనం వెజిటేబుల్ పులావ్ ఆలూ పులావ్, క్యారెట్ పులావ్ అంటూ రకరకాల పులావ్ రెసిపీలు తినే ఉంటాం. అయితే ఎప్పుడు అయినా స్వీట్ పులావ్ రెసిపీ ట్రై చేసారా. ఎప్పుడు తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే సింపుల్ గా ఇప్పుడు చెప్పిన విధంగా ట్రై చేస్తే చాలా లొట్టలు వేసుకొని మరీ తినేయాల్సిందే. మరి ఇందుకోసం ఏ ఏ పదార్థాలు కావాలి దానిని ఎలా తయారు చేయాలి అన్న విషయాన్ని వస్తే..

స్వీట్ పులావ్ కి కావలసిన పదార్థాలు:

బాస్మతీరైస్ – ఒక కప్పు
చక్కెర – ముప్పావు కప్పు
డ్రై ఫ్రూట్స్ – పావుకప్పు
నెయ్యి – నాలుగు చెంచాలు
లవంగాలు – రెండు
యాలకులు – మూడు
సోంపు – ఒక చెంచా
పాలు – మూడు చెంచాలు
కుంకుమపువ్వు – చిటికెడు
ఎండుకొబ్బరి పొడి – మూడు చెంచాలు
దాల్చినచెక్క – చిన్న ముక్క
నీళ్లు – రెండు కప్పులు

స్వీట్ పులావ్ తయారీ విధానం:

ముందుగా బియ్యాన్ని అరగంట పాటు నీటిలో నానబెట్టాలి. పాలలో కుంకుమపువ్వు కలిపి పక్కన పెట్టాలి. అడుగు మందంగా ఉన్న గిన్నెను స్టౌ మీద పెట్టి, నెయ్యి వేయాలి. వేడెక్కాక డ్రై ఫ్రూట్స్ ను వేయించి తీసేయాలి. తర్వాత అదే నేతితో యాలకులు, లవంగాలు, సోంపు, దాల్చిన చెక్క వేయాలి. ఓ నిమిషం పాటు వేయించాక నానబెట్టిన బియ్యాన్ని వేయాలి. రెండు నిమిసాలు వేయించిన తరువాత నీళ్లు, పాలలో నానబెట్టిన కుంకుమ పువ్వు వేసి బాగా కలపాలి. నీళ్లు మరిగి బుడగలు వస్తున్నప్పుడు మూత పెట్టేసి మరో పది నిమిషాలు ఉడికించాలి. బియ్యం సగం ఉడికిన తరువాత చక్కెర వేసి బాగా కలపాలి. మూత పెట్టేసి మరో ఐదు నిమిషాలు ఉడికించాలి. అన్నం ఉడికిపోయిన తరువాత డ్రై ఫ్రూట్స్, ఎండు కొబ్బరి పొడి వేసి బాగా కలిపి దించేసుకోవాలి. కావాలంటే ఇంకాస్త నెయ్యి వేసుకోవచ్చు.

Exit mobile version