Site icon HashtagU Telugu

Sweet Ponganalu: పిల్లలు ఇష్టంగా తినే తియ్యని పొంగనాలు.. అరటిపండుతో ట్రై చేయండిలా?

Mixcollage 13 Feb 2024 01 51 Pm 2006

Mixcollage 13 Feb 2024 01 51 Pm 2006

మామూలుగా మనం దోశ పిండితో పొంగనాలు తయారు చేసుకుని తింటూ ఉంటాము. అయితే కొందరు ఓన్లీ దోశ పిండితో పోసుకొని తింటే మరి కొందరు అందులోకి ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర వండి రకరకాల ఐటమ్స్ వేసుకొని తింటూ ఉంటారు. అయితే ఈ పొంగనాల నుంచి చిన్నపిల్లల నుంచి కొద్ది వరకు ప్రతి ఒక్కరూ ఇష్టంగా తింటూ ఉంటారు. ఎప్పుడూ ఒకే విధమైన పొంగనాలు కాకుండా ఎప్పుడైనా అరటి పండుతో తియ్యని పొంగనాలు తిన్నారా. ఈ రెసిపీ అంటే పిల్లలకు ఎంతో ఇష్టం. మరి వాటిని ఎలా తయారు చేయాలి అన్న విషయానికి వస్తే..

అరటిపండు పొంగనాలకు కావాల్సిన పదార్థాలు:

గోధుమ పిండి – 1 కప్పు
అరటిపండు – 2
బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్లు
కొబ్బరి తురుము – 2 టేబుల్ స్పూన్లు
బెల్లం తురుము – అర కప్పు
నీరు – తగినంత
సోడా – చిటికెడు
యాలకుల పొడి – చిటికెడు

అరటిపండు పొంగనాలు తయారీ విధానం :

అయితే ఇందుకోసం ముందుగా స్టౌవ్ వెలిగించి దానిలో దానిపై కడాయి పెట్టాలి. దానిలో నీరు వేసి అది వేడి అయ్యాక దానిలో బెల్లం వేయాలి. పూర్తిగా కరిగేవరకు ఉంచి స్టౌవ్ ఆపేసి పక్కన పెట్టేయాలి. తర్వాత ఒక గిన్నెలో అరటిపండ్ల ముక్కలు వేసి బాగా చిదమండి. మెత్తగా మాష్ చేసిన తర్వాత దానిని మిక్సింగ్ గిన్నెలోకి తీసుకుని దానిలోకి ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న బెల్లం నీటిని వడకట్టి పోయాలి. ఎందుకంటే బెల్లంలో ఉండే మలినాలు లేదా మట్టి అరటిపండు లోకి పడిపోతుంది. ఈ రెండింటిని బ్లెండ్ అయ్యేలా బాగా మిక్స్​ చేసి ఇప్పుడు దానిలో కొబ్బరి తురుము వేయాలి. అనంతరం గోధుమ పిండి, బియ్యం పిండి, సోడా వేసి బాగా కలపాలి. అనంతరం నీరు పోస్తూ ఉండలు లేకుండా పిండిని బాగా కలపాలి. ఎక్కువ నీరు వేయకుండా పిండిని కలిపి సిద్ధం చేసుకోవాలి. ఇప్పుడు స్టౌవ్ వెలిగించి దానిపై పొంగనాల పాన్ పెట్టాలి. ఒక్కో అచ్చులో నెయ్యి వేయాలి. అది వేడిగా అయినప్పుడు ముందుగా సిద్ధం చేసుకున్న మిశ్రమాన్ని అచ్చులో 3/4 నింపడానికి టేబుల్ స్పూన్​తో పిండి వేయాలి. దానిపై మూత వేసి 4 నిమిషాలు మగ్గనివ్వాలి. అంతే టేస్టీగా ఉండే తీయటి పొంగనాలు రెడీ.

Exit mobile version