Site icon HashtagU Telugu

Sweet Corn Pakoda: చలికాలం వేడివేడిగా ఉండే స్వీట్ కార్న్ పకోడా.. సింపుల్గా ట్రై చేయండిలా?

Mixcollage 10 Jan 2024 02 18 Pm 2793

Mixcollage 10 Jan 2024 02 18 Pm 2793

మామూలుగా సాయంత్రం అయింది అంటే చాలు ఏవైనా వేడివేడిగా స్నాక్స్ తినాలని అనుకుంటూ ఉంటారు. అయితే ప్రస్తుతం చలికాలం కావడంతో మనకు బయట ఎక్కువగా మొక్కజొన్న లభిస్తూ ఉంటాయి. కొందరు వీటిని కాల్చి అమ్మితే మరి కొందరు ఉడకపెట్టి అమ్ముతూ ఉంటారు. అయితే ఈ మొక్కజొన్నలలో కొంచెం లావుగా ఉండే స్వీట్ కార్న్ తో పకోడా ఎప్పుడైనా తిన్నారా. ఒకవేళ ఎప్పుడూ తినకపోతే ఇంట్లోనే సింపుల్గా ఈ రెసిపీని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్వీట్ కార్న్ పకోడాకి కావలసిన పదార్థాలు

స్వీట్ కార్న్ – 1 కప్పు
ఉల్లిపాయ – పెద్దది 1
శనగ పిండి – అర కప్పు
మిరపకాయలు – 2 నుంచి 3
బియ్యం పిండి – 1 టేబుల్ స్పూన్
పసుపు – కొద్దిగా
అల్లం, వెల్లుల్లి పేస్ట్ – 1 టేబుల్ స్పూన్
చాట్ మసాలా – కొద్దిగా
కొత్తిమీర – కొద్దిగా
కరివేపాకు – కొద్దిగా
జీలకర్ర పొడి – చిటికెడు
నూనె – సరిపడా
ఉప్పు – సరిపడా

స్వీట్ కార్న్ పకోడా తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా ఒక గిన్నెలో మొత్తగా రుబ్బిన మొక్కజొన్న వేసి, ఆపై ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర తరుగు, పసుపు, చాట్ మసాలా, జీలకర్ర పొడి, శెనగపిండి, బియ్యప్పిండి, ఉప్పు వేసి బాగా కలపాలి. తర్వాత గ్యాస్ మీద పాన్ లో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడి అయిన తర్వాత కొద్ది కొద్దిగా పిండిని చేతిలోకి తీసుకుని వేడి నూనెలో వేయాలి. బంగారు రంగు వచ్చేవరకు వేయించాలి. అంతే రుచికరమైన స్వీట్ కార్న్ పకోడా రెడీ.