Site icon HashtagU Telugu

Sweet Carrot Crackers: వెరైటీగా ఉండే స్వీట్ క్యారెట్ క్రాకర్స్.. ఇలా చేస్తే కొంచెం కూడా మిగల్చరు?

Mixcollage 22 Jan 2024 07 41 Pm 437

Mixcollage 22 Jan 2024 07 41 Pm 437

మామూలుగా ప్రతిరోజు ఒకే విధమైన వంటలు తిని చాలామందికి బోర్ కొడుతూ ఉంటుంది. అప్పుడప్పుడు కొత్త కొత్తగా ఏవైనా రెసిపీలు తినాలని అనుకుంటూ ఉంటారు. మీరు కూడా అలా ఏదైనా కొత్తగా రెసిపీలు తినాలని అనుకుంటున్నారా. ఎంతో రుచికరమైన స్వీట్ క్యారెట్ క్రాకర్స్ ని ఇంట్లోనే టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

స్వీట్ క్యారెట్ క్రాకర్స్ కావలసిన పదార్థాలు:

క్యారెట్ తురుము – ఒకటిన్నర కప్పు
చక్కెర – ముప్పావు కప్పు
మైదాపిండి – ఒక కప్పు
నీళ్లు – అరకప్పు
చీజ్ తురుము – అరకప్పు
కోడిగుడ్లు – రెండు

స్వీట్ క్యారెట్ క్రాకర్స్ తయారీ విధానం:

ఇందుకోసం క్యారెట్ తురుములో నీళ్లు వేసి స్టౌ మీద పెట్టాలి. క్యారెట్ బాగా ఉడికిన తరువాత నీటిని ఒంపేసి క్యారెట్ తురుముని ఆరబెట్టాలి. చల్లారిన తరువాత క్యారెట్, కోడిగుడ్డు సొన, చీజ్, చక్కెర కలిపి మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి. దీన్ని ఒక బౌల్ లోకి తీసుకుని, కొద్దికొద్దిగా మైదాపిండి వేసి కలుపుతూ ఉండాలి. చపాతీ పిండిలా అయ్యేవరకూ బాగా కలుపుకుని పక్కన పెట్టేయాలి. అరగంట తరువాత కొద్దికొద్దిగా మిశ్రమాన్ని తీసుకుని, ఉండలు చేసుకుని, చపాతీల్లా ఒత్తాలి. వీటిని నాలుగు వైపులా చాకుతో కోసేసి, ఆ తరువాత ఫొటోలో చూపిన విధంగా చిన్న చిన్న క్యూబ్స్ లా కట్ చేసుకోవాలి. మైక్రో అవన్ ఉన్నవాళ్లు 350 డిగ్రీల వద్ద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అవన్ లేకపోతే నూనెలో డీప్ ఫ్రై చేసుకోవచ్చు. అంతే స్వీట్ క్యారెట్ క్రాకర్స్ రెడీ.