Site icon HashtagU Telugu

Sweat in Sleep: నిద్రలో చెమటపడుతోందా.. అయితే మీరు ఈ సమస్యల బారిన పడినట్టే?

Sweat In Sleep

Sweat In Sleep

చెమటలు పట్టడం అన్నది సర్వసాధారణమైన విషయమే. ఏదైనా పని చేస్తున్నప్పుడు, లేదంటే ఎండాకాలంలో, టెన్షన్ పడుతున్న సమయంలో ఇలా అనేక సందర్భాలలో చెమట వస్తూ ఉంటుంది. అలాగే ఎండాకాలంలో రాత్రి, పగలు కొద్దిసేపు కరెంటు పోతేనే తట్టుకోలేం. అయితే కొంతమందికి ఏ టెన్షన్స్ ఏ పని చేయకుండానే కొన్ని కొన్ని సార్లు అనవసరంగా చెమట పడుతూ ఉంటుంది. అలాగే మరి కొంతమందికి రాత్రి సమయంలో నిద్ర పోతున్నప్పుడు కూడా చెమట పడుతూ ఉంటుంది. అయితేచెమట పట్టడానికి తేలిగ్గా తీసేయకూడదు. అలా చెమట పట్టడం అన్నది కొన్ని రకాల సమస్యలకు సంకేతంగా చెప్పుకోవచ్చు.

మరి నిద్రలో చెమట పడితే అది ఎటువంటి సమస్యలకు సంకేతమో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఏసీలో ఉన్నప్పటికీ రాత్రి సమయంలో పడుకున్నప్పుడు చెమట వస్తే వెంటనే వైద్యుని సంప్రదించడం ఎంతో మంచిది. అలాగే టైట్ బట్టలను కాకుండా వదులుగా ఉన్న బట్టలను ధరించాలి. గది కిటికీలను కూడా తెరిచి ఉంచడం ఒక విధంగా మంచిదే అని చెప్పవచ్చు. మధుమేహంతో బాధపడుతున్న వారికి షుగర్ లెవెల్స్ తగ్గడం ఎక్కడం లాంటి సమస్యలు వచ్చినప్పుడు చెమట బాగా పడుతుంది. మధుమేహం ఉన్న వారి శరీరంలో ఇన్సులిన్ తగ్గితే ఈ విధంగా చెమట పడుతుంది.

అలాగే ఆందోళన,టెన్షన్, ఒత్తిడి,భయం లాంటి సమస్యలకు గురి అయ్యే వారికి కూడా విపరీతమైన చెమట పడుతూ ఉంటుంది. మరి ముఖ్యంగా ఎక్కువగా ఆందోళన చెందిన్నప్పుడు భయపడుతున్నప్పుడు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగి బాడి కూల్ గా అవ్వడం కోసం చెమట రిలీజ్ అవుతూ ఉంటుంది. అలాగే రాత్రి సమయంలో ఆల్కహాల్ సేవించే వారికి కూడా చెమట పడుతుంది. ఎందుకంటే వాయు మార్గాలపై ఆల్కహాల్ ప్రభావం పడుతుంది. దాంతో తీసుకోవడంలో ఇబ్బంది కలిగడం మాత్రమే కాకుండా గాలి పీల్చుకోవడానికి శరీరం అవసరానికి మంచి కష్టపడుతుంది. దాంతో శరీరంలో టెంపరేచర్ పెరిగి, గుండె కొట్టుకునే వేగం కూడా పెరుగుతుంది. తద్వారా చెమట రిలీజ్ అవుతుంది. క్యాన్సర్ లక్షణాలు ఉన్నవారికి కూడా చెమట అధికంగా పడుతూ ఉంటుంది. నిద్రపోతున్నప్పుడు నిద్రలో ఎక్కువగా చమట వస్తే అది క్యాన్సర్ సోకింది అనడానికి సంకేతంగా చెప్పవచ్చు. క్రమంగా ఈ చెమట లింఫోమా అనే క్యాన్సర్ కు దారితీయవచ్చు. అలాగే ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నప్పుడు కొన్ని రకాల టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటారు. టాబ్లెట్స్ కారణంగా కూడా ఉక్కపోతతో పెట్టి చెమట వస్తూ ఉంటుంది. మరి ముఖ్యంగా పెయిన్ కిల్లర్స్, స్టెరాయిడ్స్, యాంటీ డిప్రెసెంట్స్ వంటి మెడిసిన్స్ బాడీ టెంపరేచర్ ను పెంచడమే కాకుండా శరీరంపై విపరీతంగా చెమటలు వచ్చేలా చేస్తుంది.

Exit mobile version