Site icon HashtagU Telugu

Survey On Physical Relations: శారీరక సంబంధాలపై స‌ర్వే.. షాకింగ్ విష‌యాలు వెల్ల‌డి..!

Relationship

Relationship

Survey On Physical Relations: భారతదేశంలో శారీరక సంబంధాలు తరచుగా బహిరంగంగా చ‌ర్చించ‌రు. కానీ చాలా మంది రహస్యంగా చదవడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించి ప్రపంచ వ్యాప్తంగా సర్వే నిర్వహించి నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది శారీర‌క జీవితాలు (Survey On Physical Relations) బయటపడ్డాయి. ఇండియానా యూనివర్శిటీకి చెందిన కిన్సే ఇన్స్టిట్యూట్ పరిశోధకులు ఒక నివేదికను సిద్ధం చేశారు. దీనిలో వివిధ తరాల వ్యక్తులు సగటున నెలలో ఎన్నిసార్లు శారీరక సంబంధాలు కలిగి ఉన్నారనే దాని గురించి సమాచారం ఇచ్చారు. ఈ నివేదికలోని గణాంకాలు దిగ్భ్రాంతికరమైనవి. జనరేషన్ Z లైంగిక జీవితం మునుపటి తరాల కంటే చాలా తక్కువ చురుకుగా ఉన్నట్లు చూపిస్తుంది. నివేదిక ఏం చెబుతుందో పూర్తిగా తెలుసుకుందాం.

సర్వే ఎలా జరిగింది?

ది స్టేట్ ఆఫ్ డేటింగ్: హౌ జెన్ జెడ్ లైంగికత- సంబంధాలను పునర్నిర్వచించడం అనే పేరుతో ఈ నివేదికను రూపొందించారు. ఫీల్డ్ అనే డేటింగ్ యాప్‌లో 3,310 కంటే ఎక్కువ మంది వ్యక్తుల డేటా ఆధారంగా ఈ నివేదిక రూపొందించబడింది. పాల్గొన్న‌వారు 18 నుండి 75 సంవత్సరాల వయస్సు గలవారు. 71 వేర్వేరు దేశాల నుండి వచ్చారు. వారి లైంగిక జీవితానికి సంబంధించిన ప్రశ్నలకు సమాధానమివ్వడానికి వారిని సర్వేలో చేర్చారు.

Also Read: Upcoming IPOs: ఇన్వెస్ట‌ర్ల‌కు గుడ్ న్యూస్‌.. రేప‌టి నుంచి అందుబాటులోకి మూడు ఐపీవోలు..!

సర్వే సమాధానాలు ఏమిటి?

నివేదిక డేటా ప్రకారం.. జనరేషన్ Z పార్టిసిపెంట్లు గత నెలలో సగటున 3 సార్లు మాత్రమే శృంగారం చేసినట్లు నివేదించారు. అదే సమయంలో మిలీనియల్స్, జనరేషన్ X మధ్య కొంచెం ఎక్కువ శారీరక సంబంధాలు ఉన్నాయి. ఈ రెండు తరాలు గత నెలలో ఐదుసార్లు శారీరక సంబంధాలు పెట్టుకున్నట్లు ఈ నివేదికలో పేర్కొంది. బూమర్లు కేవలం 3 సార్లు మాత్రమే శారీరక సంబంధం కలిగి ఉన్నారు. జెనరేషన్ Z, బూమర్‌లు సాధారణ లైంగిక జీవితాలను కలిగి ఉన్నార‌ని ఈ డేటా చూపిస్తుంది.

జనరేషన్ Z ఎందుకు వెనుకబడి ఉంది? కారణాలేంటి?

జనరేషన్ Z తరానికి చెందిన వ్యక్తులు వారి కెరీర్, ఇతర విషయాలపై ఎక్కువ దృష్టి పెట్టడం వల్ల శారీరక సంబంధాలకు తక్కువ సమయం ఉంటుందని పరిశోధకులు అంటున్నారు. నివేదిక ప్రకారం “Gen Z, బూమర్‌లు ఇద్దరూ దాదాపు ఒకే శృంగార ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటారు. చిన్నవారు, పెద్దవారు తక్కువ చురుకైన లైంగిక జీవితాలను కలిగి ఉన్నారని సూచిస్తుంది. Gen Z పాల్గొనేవారిలో దాదాపు సగం మంది ఒంటరిగా ఉన్నారని, మిలీనియల్స్‌లో తరంలో ఐదవ వంతు మాత్రమే (20%) ఒంటరిగా ఉన్నారని నివేదిక కనుగొంది.

Gen Z తరం తక్కువ చురుకైన లైంగిక జీవితాన్ని కలిగి ఉన్నప్పటికీ ఈ తరం బెడ్‌రూమ్‌లో అత్యంత సాహసోపేతమైనదిగా పరిగణించబడుతుంది. 55% Gen Z పార్టిసిపెంట్‌లు ఫీల్డ్ యాప్‌లో కనెక్ట్ అయిన తర్వాత కొత్త కింక్‌ని కనుగొన్నారని నివేదిక కనుగొంది. ఈ సంఖ్య మిలీనియల్స్‌లో 49%, జనరేషన్ Xలో 39%, బూమర్‌లలో 33%గా ఉంది.