Red Wine: వైన్ తాగితే అందంగా మారతారా.. ఇందులో నిజమెంత?

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. ఈ మధ్యపానం అలవాటు మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. కొందరు మద్యానికి బాన

  • Written By:
  • Publish Date - August 4, 2023 / 09:20 PM IST

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని చెబుతూ ఉంటారు. ఈ మధ్యపానం అలవాటు మనిషిని ఎంతటి దారుణానికైనా ఒడిగట్టేలా చేస్తుంది. కొందరు మద్యానికి బానిసలు అయిపోయి ఏం చేస్తున్నారో ఎలా ప్రవర్తిస్తున్నారో కూడా తెలియకుండా చేస్తుంటారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా కూడా పూర్తిగా దెబ్బ తింటారు అతిగా తాగడం అంత మంచిది కాదు. లివర్ పాడైపోతుందని ఇదివరకే తెలుసు అయితే ఇప్పుడు దీని గురించి మరో కొత్త విషయం తేలింది. అదేంటంటే రోజూ కాసింత వైన్ తాగితే అందంగా తయారవుతారట. వృద్ధాప్యం కూడా త్వరగా రాదట.

వినడానికి కాస్త ఆశ్చర్యంగా ఉన్న ఇది నిజం. అలా అని దేన్నిబడితే దాన్ని తాగకూడదట. ఈ విషయంలో కచ్చితంగా సూచనలు పాటించాలి అని చెబుతున్నారు వైద్యులు. బ్లాక్ బెర్రీ, వోట్స్ వంటి వాటితో చేసిన వైన్ తాగడం వల్ల ఆరోగ్యానికి మేలు జరుగుతుంది. ఇందులో కార్బనెట్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరానికి కూడా చాలా మంచిదని పరివోధకులు చెబుతున్నారు. అదే విధంగా రెడ్ వైన్, వైట్ కూడా మంచివేనట. వైన్ మంచిదే అన్నారు కదా అని ఎంత బడితే అంత తాగడం అసలు మంచిది కాదు. గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఆమ్ల జనకాలు రెడ్ వైన్‌లో ఎక్కువగా ఉంటాయి. దీన్ని మోతాదులో తీసుకుంటే ఎక్కువ కాలం ఆనందంగా జీవిస్తారు. ఇలా తాగడం వల్ల యవ్వనంగా, చర్మం ముడతలు పడకుండా యంగ్‌గా కనిపించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయట.

చర్మకణాలను దెబ్బతినకుండా చర్మ సమస్యలు రాకుండా కాపాడే ఎన్నో ఫ్లేవనాయిడ్స్ వైన్‌లో ఎక్కువగా ఉంటాయి. కేవలం అందం విషయంలోనే కాదండోయ్. వైన్ తీసుకోవడం వల్ల ఆరోగ్య పరంగా కూడా బాగుంటుంది. వైన్ తాగడం వల్ల హైబీ కంట్రోల్ అవుతుంది. మధుమేహం కూడా కంట్రోల్‌లో ఉంటుందట్. బీర్స్, మద్యం తాగేవారితో పోలిస్తే వైన్ తాగేవారు ఆరోగ్యంగా ఉంటారట. అలాగే ఆయుష్షు కూడా పెరుగుతుందట. అందరికీ మద్యపానం అలవాటు ఉండదు ఉన్నా కొంతమందికి ఇష్టం ఉండదు. అలాంటివారు క్రాన్ బ్రెర్రీస్, బ్లూ బెర్రీస్, దాక్ష పండ్లు తిన్నా వృద్ధాప్య ఛాయలు దరిచేరవు. రెడ్ వైన్‌లో రెస్వెట్రాల్ ఉంటుంది. ఇది వృద్ధాప్య లక్షణాలను దరికి చేరనివ్వదు. ఇందులోని కొన్ని గుణాలు గుండె సమస్యలను దూరం చేస్తుంది. వైన్ తాగడం వల్ల ఇంకా చాలా లాభాలే ఉన్నాయి. తక్కువ మోతాదులో వైన్ తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వేధించవు.