Onion Juice: జుట్టు ఒత్తుగా పెరగాలా.. అయితే ఉల్లిపాయతో ఇలా చేయాల్సిందే?

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మరి. ఒక ఆరో

  • Written By:
  • Publish Date - March 3, 2024 / 08:43 PM IST

మామూలుగా ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని అంటూ ఉంటారు. ఎందుకంటే ఉల్లిపాయ వల్ల అన్ని రకాల ప్రయోజనాలు ఉన్నాయి మరి. ఒక ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి, జుట్టుకు సంబంధించిన సమస్యలకు ఉల్లిపాయ ఎంతో బాగా ఉపయోగపడుతుంది. మనలో చాలామంది ఉల్లిపాయలు తినడానికి అస్సలు ఇష్టపడరు. కొందరు మాత్రం ఉల్లిపాయను పచ్చిగానే తెగ తినేస్తూ ఉంటారు. ఇక ఉల్లిపాయ వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల సంగతి పక్కన పెడితే జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఉల్లిపాయ ఎంతో అద్భుతంగా పనిచేస్తుంది. ఆనియన్ కంటే ఇంకా మెరుగైనది ఏదీ అంటే ఆనియన్ జ్యూస్ అనే చెప్పుకోవాలి. ఉల్లిపాయ రసం జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గించడంలో ఎంతో బాగా పనిచేస్తుంది.

ఆరోగ్యంగా ఉండేందుకు మనం రకరకాల జ్యూస్ లను మనం మన డైట్ లో భాగం చేసుకుంటూ ఉంటాం. కానీ వాటికి బదులుగా ఆనియన్ జ్యూస్ ని మన డైట్ లో చేర్చుకోవడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు కలుగుతాయి. ఆనియన్ అనేది మనకు దృష్టిలోకే రాదు. ఐతే, ఆర్గానోసల్ఫర్ కాంపౌండ్ అలిసిన్ అనేది ఇందులో పుష్కలంగా లభిస్తుంది. కాబట్టి, ఆనియన్ జ్యూస్ అనేది మెటాబాలిజాన్ని పెంపొందిస్తుంది. కొలెస్ట్రాల్ లెవెల్స్ ను తగ్గిస్తుంది. బ్లడ్ సర్కులేషన్ ను ఇంప్రూవ్ చేస్తుంది. కార్డియో వాస్క్యులార్ రిస్కులను తగ్గిస్తుంది. యూరినరీ డిజార్డర్స్ ను ట్రీట్ చేస్తుంది. ఇక్కడితో ఆనియన్ జ్యూస్ కి సంబంధించిన లాభాల జాబితా పూర్తవలేదు. దీని నుంచి లభించే ప్రయోజనాలు ఎన్నో ఉన్నాయి.

ఈ అద్భుతమైన వెజిటబుల్ లో సల్ఫర్ పుష్కలంగా లభిస్తుంది. అంతేకాదు, విటమిన్ ఏ, బీ, సి,ఈ అలాగే శక్తివంతమైన క్వర్సెంటైన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు ఎన్నో ఇతర ఫ్లెవనాయిడ్స్ కూడా సమృద్ధిగా లభిస్తాయి. ఇంతకీ ఈ ఆనియన్ జ్యూస్ ను ఎలా తయారు చేసుకోవాలి అన్న విషయానికి వస్తే.. ఆనియన్ ను పీల్ తీసేసి, రన్నింగ్ వాటర్ లో ఆనియన్ ను శుభ్రంగా కడగాలి. ఈ స్టెప్ అనేది వెజిటబుల్ ను శుభ్రం చేయడానికి హెల్ప్ చేస్తుంది.

తాజా పేపర్ టవల్ తీసుకుని ఆనియన్ పై ఉన్న తడిని తుడిచి, ఇపుడు ఆనియన్ ను పదునైన కత్తి సహాయంతో తరగాలి. ఇప్పుడు ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో పెట్టి డివైస్ ను ఆన్ చేయాలి. ఒక్కొక్కటిగా ఆనియన్ పీసెస్ ను జ్యూసర్ లో వేయాలి. జ్యూస్ వస్తుంది. ఇప్పుడు జ్యూసర్ ను శుభ్రంగా కడగాలి. వేడి నీళ్లతో కడగాలి. కొద్ది నిమిషాలు స్క్రబ్ చేయాలి. అపుడే, ఆనియన్స్ ఘాటైన వాసన పూర్తిగా తొలగిపోతుంది. ఫ్రెష్ ఆనియన్ జ్యూస్ ను గ్లాస్ లోకి ట్రాన్స్ఫర్ చేసి అవసరానికి తగినట్టుగా వాడాలి. ఇది జుట్టుకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరగా ఒత్తుగా పెరగడంతో పాటు చుండ్రు సమస్య తగ్గిపోతుంది. అలాగే జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల సమస్యలకు ఇది ఎంతో బాగా పనిచేస్తుంది.