Site icon HashtagU Telugu

Oil For Hair Growth: కొబ్బరినూనెలో ఇది కలిపి రాస్తే చాలు.. చుండ్రు మాయం?

Oil For Hair Growth

Oil For Hair Growth

ఈ రోజుల్లో చాలామంది ఎదుర్కొంటున్న వాటిలో చుండ్రు ప్రధాన సమస్యగా మారిపోయింది. చాలామంది నలుగురిలో ఉన్నప్పుడు ఈ చుండ్రు సమస్య కారణంగా అవమానంగా ఫీల్ అవుతూ ఉంటారు. చుండ్రును తగ్గించుకోవడం కోసం ఎన్ని రకాల చిట్కాలను ఉపయోగించినప్పటికీ వాటి వల్ల ఫలితం రాలేదని దిగులు చెందుతూ ఉంటారు. జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలు ఒక ఎత్తు అయితే చుండ్రు సమస్య మరొక ఎత్తు అని చెప్పవచ్చు. మరి చుండ్రు సమస్య దూరం అవ్వాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కర్పూరాన్ని కేవలం దీపారాధన కోసం మాత్రమే ఉపయోగిస్తారని అనుకుంటూ ఉంటాను.

దీని వల్ల జుట్టుకి కూడా మేలు జరుగుతుంది. కర్పూరాన్ని కొబ్బరినూనెలో కలిపి రాయడం వల్ల చాలా సమస్యలు దూరమవుతాయి. అందులో చుండ్రు సమస్య కూడా ఒకటి. కొబ్బరి నూనె, కర్పూరాన్ని కలిపి రాయడం వల్ల అది బలమైన యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు కలిగి ఉంటుంది. ఈ రెండింటికి కలయిక వల్ల స్కాల్ఫ్ ఫంగస్, బ్యాక్టీరియా, దురద, అలర్జీలు దూరమవుతాయి. చాలా మంది పేను సమస్యతో తెగ ఇబ్బంది పడుతుంటారు. కర్పూర నూనె ఆ సమస్యకి కూడా చెక్ పెడుతుంది. కర్పూరంలోని యాంటీ పరాసిటిక్ లక్షణాలు ఉన్నాయి.

ఇవి పేలను దూరం చేస్తాయి. దీని కోసం రెండు చెంచాల కొబ్బరి నూనె, ఒక చెంచా కర్పూరాన్ని కలిపి పేస్టులా చేసి తలకి పట్టించి రాత్రంతా అలానే ఉంచి క్లీన్ చేసుకోవాలి. చాలా వరకూ చుండ్రు ఎక్కువగా ఉండడం వల్లే జుట్టు రాలుతుంటుంది. అలాంటప్పుడు కొబ్బరినూనెలో కర్పూరాన్ని కలిపి రాయడం వల్ల జుట్టు సమస్యలు దూరమై జుట్టు బలంగా మారతుుంది. కర్పూరం, కొబ్బరినూనె జుట్టు పెరుగుదలలో వచ్చే సమస్యల్ని దూరం చేసి పొడవుగా, మందమైన జుట్టుని పొందేందుకు సాయపడుతుంది. ఈ నూనె రాయడం వల్ల జుట్టు తెల్లబడే సమస్యని కూడా దూరమవుతుంది.