Pimples: ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా మొటిమలు వస్తున్నాయా.. అయితే ఇది తెలుసుకోండి?

ఈ రోజుల్లో చాలామంది యువత ముఖంపై మొటిమలు నల్లటి మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ముఖం అంద విహీనం

  • Written By:
  • Publish Date - March 5, 2024 / 07:39 AM IST

ఈ రోజుల్లో చాలామంది యువత ముఖంపై మొటిమలు నల్లటి మచ్చల సమస్యతో ఇబ్బంది పడుతున్న విషయం తెలిసిందే. వీటి కారణంగా ముఖం అంద విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా అమ్మాయిలు ఈ విషయంలో ఎన్నో రకాల జాగ్రత్తలు పాటించడంతో పాటు బ్యూటీ పార్లర్ ల చుట్టూ తిరిగి వేలకు వేలు ఖర్చు చేస్తూ ఉంటారు. చాలా మంది ముఖం కాంతివంతంగా మారడం కోసం ఎన్నో చిట్కాలు కూడా పాటిస్తుంటారు. క్రీములు, పేస్టులు వాడతారు కానీ ఎన్ని వాడినా ముఖంపై మొటిమలు పోకపోవడంతో తీవ్రంగా సతమతం అవుతారు. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ మొటిమలు తగ్గడం లేదా. అయితే దాని వెనుక ఉన్న కారణాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

హార్మోనల్ ప్రాబ్లం వల్ల కూడా స్కిన్ కేర్ రొటీన్ పని చేయకపోవచ్చు. రొటీన్ చేంజ్ అవ్వడం, వాతావరణం మారడం, స్ట్రెస్ వంటి వాటి వల్ల టెంపరరీ హార్మోనల్ ఇన్‌బాలెన్స్ అవుతుంది. ఈ ఎఫెక్ట్ ఫేస్ మీద కనపడొచ్చు. అందుకని, కొన్ని సార్లు మీరు కొద్దిగా ఈ విషయాలని తేలిగ్గా తీసుకోండి. మీ బాడీ రీ-ఎడ్జస్ట్ అవ్వడానికి టైమ్ ఇవ్వాలి. మీ స్కిన్ తనని తాను బాగు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలి. ఒక రొటీన్ వరుసగా కొన్నాళ్ళ పాటూ ఫాలో అయినప్పుడు మీ స్కిన్ దానికి అలవాటు పడిపోయి ఉంటుంది. దీంతో అప్పుడప్పుడూ బ్రేకౌట్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు సరిపోయే ఇంకొన్ని స్కిన్ కేర్ రొటీన్స్‌ని కూడా వెతుక్కుని ఉండడం మంచిది. అప్పుడప్పుడూ రొటీన్ మార్చి చూడడం వలన ఉపయోగం ఉండవచ్చు. మీ స్కిన్ కేర్ వల్ల మీరు అనుకున్న ఫలితం రాకపోవడానికి మరొక కారణం కూడా.

ఈ ప్రోడక్ట్స్ ని మీరు రెగ్యులర్ గా వాడకపోవచ్చు, కరెక్ట్ పద్ధతిలో వాడుతూ ఉండి ఉండకపోవచ్చు. ఒక్కోసారి ప్రోడక్ట్స్ ఎక్కువ వాడినా అనుకున్న రిజల్ట్‌ని ఇవ్వవు. తక్కువ వాడినా పని చేయవు. అందుకని, మీ ప్రోడక్ట్స్‌ని సరిగ్గానే వాడుతున్నారా అని చెక్ చేసుకోవాలి. ప్రోడక్ట్స్ ఎక్స్పైరీ డేట్ చెక్ చేసుకుంటూ యూజ్ చేయండి. లేదంటే, సిచ్యుయేషన్ ఇంకా బ్యాడ్ గా తయారవ్వచ్చు. మీది సెన్సిటివ్ స్కిన్ అయితే, నాచురల్ హోం మేడ్ ప్రోడక్ట్స్ నే యూజ్ చేయాలి. మీ ప్రోడక్ట్స్ ని సరిగ్గా స్టోర్ చేస్తున్నారా లేదో చెక్ చేసుకోవడం మంచిది. బాగా ఎండ తగిలే చోట ఈ ప్రోడక్ట్స్ ని ఉంచ కూడదు. స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ ఎప్పుడూ గాలి తగిలే ప్రదేశంలో, ఎండ తగలని ప్రదేశంలో ఉంచాలి. కొన్ని ప్రోడక్ట్స్‌ని ఫ్రిజ్‌లో కూడా ఉంచుకోవచ్చు. వాతావరణం మారినప్పుడల్లా స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ కూడా మారుతూ ఉండాలి. చెమట ఎక్కువగా ఉండే వేసవి కాలంలో వాడే ప్రోడక్ట్స్ కొన్ని స్కిన్ డ్రైగా అయిపోయే శీతా కాలంలో వాడకూడదు. ఏదైనా హెల్త్ ప్రాబ్లమ్ కోసం మీరు తీసుకుంటున్న మెడిసిన్స్ మీ స్కిన్ కేర్ తో క్లాష్ అవ్వవచ్చు. కొన్ని మెడిసిన్స్ యాక్నే కి కారణమైతే, కొన్ని మెడిసిన్స్ స్కిన్ ని డ్రై గా చేయవచ్చు. మీ డాక్టర్ తో మాట్లాడి అవసరాన్ని బట్టి స్కిన్ కేర్ ప్రోడక్ట్స్ మార్చుకోవాలి.