Site icon HashtagU Telugu

Radish: చర్మ సమస్యలు తగ్గిపోవాలంటే ముల్లంగిని ఇలా ఉపయోగించాల్సిందే?

Radish

Radish

మన వంటింట్లో దొరికితే కూరగాయలలో ముల్లంగి కూడా ఒకటి. ఈ ముల్లంగిలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి అన్న విషయం మనందరికి తెలిసిందే. ముల్లంగి తరచుగా తీసుకుంటూ ఉండటం వల్ల చాలా రకాల ప్రయోజనాలు కలుగుతాయి. మొలలు, ఉబ్బసం, దగ్గు, ఆస్తమా, ముక్కు, చెవి, గొంతు నొప్పిగా లాంటి సమస్యలతో బాధపడేవారు ముల్లంగి తింటే ఎంతో మంచిది. ముల్లంగిలో గ్లూకోసైడ్, ఎంజైములతోపాటూ ఆకలిని పెంచి మలబద్ధకాన్ని దూరం చేసే గుణాలు ఉన్నాయి. ముల్లంగి కేవలం ఆరోగ్యానికి మంచిది అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే సమ్మేళనాలు కూడా ఉంటాయి. ఈ రూట్ కూరగాయలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.

ఇవి మీ చర్మానికి అద్భుతమైన ప్రయోజనాలను కలిగిస్తాయి. మీ చర్మ సంరక్షణ దినచర్యలో ముల్లంగిని ఉపయోగించడం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. ముల్లంగిలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే చర్మ ఎరుపును, వాపును తగ్గిస్తాయి. అలాగే అసౌకర్యాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. ఇవి వివిధ చర్మ సమస్యలను తగ్గించడానికి సహాయపడతాయి.. అయితే ముల్లంగితో చేసే మాస్క్ లు, టోనర్లను ఉపయోగించడం చాలా సులభం. ముల్లంగిలో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.

అందుకే ముల్లంగి మీ చర్మానికి సహజ హైడ్రేటర్ గా పనిచేస్తుంది. ఈ కూరగాయలోని తేమ మీ చర్మం ఆర్ద్రీకరణ సమతుల్యతను నిర్వహించడానికి సహాయపడుతుంది. దీంతో మీ చర్మం మృదువుగా మారుతుంది. అలాగే మీ చర్మానికి బాగా పోషణ కూడా అందుతుంది. ముల్లంగి విటమిన్ సి కి శక్తివంతమైన మూలం. ముల్లంగి కొల్లాజెన్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. ఇది మీ చర్మ స్థితిస్థాపకతను ప్రోత్సహించే ముఖ్యమైన ప్రోటీన్. ఇది సున్నితమైన రంగు, సన్నని గీతలను తొలగిస్తుంది.