కలబందని ఎన్నో ఏళ్ల నుంచి ఉపయోగిస్తున్న విషయం తెలిసిందే. పూర్వకాలం నుంచి దీనిని ఎన్నో ఔషధాల తయారీలో ఉపయోగిస్తూ వస్తున్నారు. కలబంద ఎన్నో రకాల సమస్యలకు చక్కటి పరిష్కారం అని చెప్పాలి. దీనివల్ల కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. జుట్టుకు కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. కాగా చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే కలబందను ఉపయోగించి కళ్ళ ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవచ్చట. ఈ మొక్కలో విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మొక్క ఎన్నో కంటి సమస్యలను తగ్గిస్తుంది. మరి కలబందను ఎలా ఉపయోగించాలి అన్న విషయానికొస్తే..
కలబంద ఒక సహజ మాయిశ్చరైజర్. ఈ కలబంద గుజ్జు పొడి కళ్లను తగ్గిస్తుంది. కళ్లలో చికాకు నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే కళ్లను హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది. ఇది కంటి అసౌకర్యం నుంచి కూడా ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు. కలబందలో శోథ నిరోధక లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి కళ్ల చుట్టూ ఉన్న నలుపును, వాపును తగ్గిస్తాయి. ముఖ్యంగా రోజు ఎక్కువ సేపు స్క్రీన్ ను చూడటం, పర్యావరణ కాలుష్యం వల్ల కళ్ల చికాకు కలుగుతుందట. అయితే దీన్ని తగ్గించేందుకు కలబంద సహాయపడుతుందని చెబుతున్నారు. కలబందలో శీతలీకరణ ప్రభావాలు ఉంటాయి. ఇది అలిసిన కళ్లను రిఫ్రెష్ చేస్తుంది. కంటి ఒత్తిడిని కూడా తగ్గిస్తుందట. అంతేకాదు కళ్లకు మంచి విశ్రాంతిని కలిగిస్తాయట.
కలబందలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి మన కళ్లను ఆక్సీకరణ ఒత్తిడి, ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి రక్షిస్తాయని చెబుతున్నారు. కలబందలో హైడ్రేటింగ్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కళ్లకింద నల్లటి వలయాలను తగ్గించడానికి సహాయపడతాయి. కలబంద గుజ్జు కళ్ల చుట్టూ ఉన్న చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. నలుపుదనాన్ని పోగొడుతుందని కాబట్టి కలబందను ఉపయోగించడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రావని చెబుతున్నారు.