Mung Bean: పెసరపప్పుతో మొటిమలు తగ్గుతాయా.. ఇందులో నిజమెంత!

  • Written By:
  • Updated On - March 25, 2024 / 03:39 PM IST

పెసరపప్పు వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఈ పెసరపప్పును ఉపయోగించి ఎన్నో రకాల వంటలు కూడా చేస్తూ ఉంటారు. పెసరపప్పు అనగానే చాలామందికి మొలకెత్తిన పెసలు గుర్తుకు వస్తూ ఉంటాయి. ఎక్కువ శాతం మంది మొలకెత్తిన పెసలను తినడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇంకొందరు పెసర బ్యాల్ల పాయసం పెసర బ్యాల్ల పప్పు అంటూ రకరకాల రెసిపీలు తయారు చేసుకుని తింటూ ఉంటారు.చాలామందికి తెలియని విషయం ఏమిటంటే.. పెసలు కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడతాయి.

ముఖం, చర్మం, జుట్టు -ఎలాంటి సమస్యలకైనా పెసలతో చెక్ పెట్టవచ్చు. బ్యూటీ పార్లర్స్ లేని ఈ సమయంలో పెసర్లతో ఎన్నో లాభాలు ఉన్నాయి. మరి పెసరపప్పుతో అందాన్ని ఎలా పెంచుకోవచ్చో ఇది అందానికి ఎలా ఉపయోగపడతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. పెసలతో చేసే ఫేస్ పాక్ డ్రై స్కిన్ వారికి మాజిక్ లాగా పనిచేస్తుంది. ఒక గుప్పెడు పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ పేస్ట్ అప్లై చెసి పదిహేను-ఇరవై నిమిషాల పాటూ ఉంచెయ్యండి. ఇది ఆరిపోయిన తరవాత నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోండి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారౌతుంది.

ఇలా రెగ్యులర్‌గా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ముఖం కూడా నిగారిస్తూ అందంగా మారుతుంది. చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలతో, యాక్నే తోటీ విసుగెత్తిన వారందరూ ఒక్కసారి పెసలు వాడి చూశారంటే ఇంక వాటిని వదలరు. గుప్పెడు పెసలని రాత్రంతా నీటిలో నానబెట్టండి. పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి. అందులో కొంచెంగా నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేయండి. ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ పది నిమిషాలుంచండి. గోరువెచ్చటి నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేయండి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు.

సమ్మర్ వచ్చిందంటే సన్ టాన్ కూడా వచ్చినట్టే. మండే ఎండలో బైటికి వెళ్ళాల్సి వచ్చినవారికి టానింగ్ పెద్ద సమస్య. దీని కోసం, గుప్పెడు పెసల్ని రాత్రంతా నీటిలో నానబట్టి పొద్దున్న మెత్తగా రుబ్బండి. ఇందులో చల్లటి పెరుగు గానీ, అలోవెరా జెల్ కానీ వేసి కలపండి. ముఖం మీద, చేతుల మీద, టానింగ్ సమస్య ఎక్కడుంటే అక్కడ, ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి. ఒక పదినిమిషాలు ఉంచేసి చల్లని నీటితో కడగండి. ఇది టాన్ పోగొట్టడమే కాదు, చర్మాన్ని మృదువుగా చేస్తుంది. జుట్టు ఊడిపోతున్నా, డ్రై అయిపోతున్నా జుట్టు డల్ గా ఉన్నా పెసలతో చేసే హెయిర్ పాక్ బాగా పనిచేస్తుంది. కాసిని పెసల్ని ఉడకబెట్టి రుబ్బండి. ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగూ వేసి కలపండి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి పదిహేను నిమిషాలు ఉంచండి. మైల్డ్ షాంపూ తో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోండి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలుంటాయి. జుట్టుకి సంబంధించిన అన్ని సమస్యలని ఈ ప్యాక్ పోగొడుతుంది. ఇన్ని లాభాలు ఉన్న పెసలని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. మార్కెట్స్‌లో ఎన్నో బ్యూటీ ప్రొడక్ట్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఇవన్నీ ఎన్నో ఫలితాలను పెసర్లు ఇస్తాయి. వీటిని వాడడం వల్ల ఎలాంటి సమస్యలు ఉండవు. అంతేకాక, ఇవి అందరికీ అందుబాటులో కూడా ఉంటాయి కాబట్టి చక్కగా వాడి వీటి ప్రయోజనాలనీ మీరు పొందచ్చు.