Site icon HashtagU Telugu

Mung Bean Benefits: మొటిమలతో ఇబ్బంది పడుతున్నారా.. పెసరపప్పుతో ఇలా చేయాల్సిందే?

Mung Bean Benefits

Mung Bean Benefits

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ముఖంపై మొటిమల సమస్యలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మొటిమలతో పాటు వాటి కారణంగా ఏర్పడే గుంతల వల్ల కూడా చాలామంది అమ్మాయిలు అబ్బాయిలు చాలా రకాల ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తున్నారు. ఈ మొటిమల కారణంగా ముఖం అంతా కూడా అంత విహీనంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే అలా మొటిమల సమస్యలతో బాధపడుతున్న పెసర్లతో ఆ సమస్యను తగ్గించుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ముఖం, చర్మం, జుట్టు ఎలాంటి సమస్యలకైనా పెసలతో చెక్ పెట్టవచ్చు. పెసలతో చేసే ఫేస్ పాక్ డ్రై స్కిన్ వారికి మాజిక్ లాగా పనిచేస్తుంది. ఒక గుప్పెడు పెసలని రాత్రంతా పచ్చిపాలలో నానబెట్టి, పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బండి.

ముఖం శుభ్రంగా కడుక్కున్న తరువాత ఈ పేస్ట్ అప్లై చెసి 15-29 నిమిషాల పాటు ఉంచి ఆరిపోయిన తరవాత నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మృదువుగా తయారౌతుంది. ​​అలాగే చాలా మంది మొటిమలతో బాధపడుతుంటారు. మొటిమలతో, యాక్నే తోటీ విసుగెత్తిన వారందరూ ఒక్కసారి పెసలు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి. గుప్పెడు పెసలని రాత్రంతా నీటిలో నానబెట్టి పొద్దున్న వాటిని మెత్తగా రుబ్బి,అందులో కొంచెం నెయ్యి కలిపి ముఖానికి అప్లై చేయాలి. ముఖాన్ని నెమ్మదిగా మసాజ్ చేస్తూ పది నిమిషాలు తరువాత గోరువెచ్చటి నీటితో కడిగేసి ముఖాన్ని మెత్తటి బట్టతో క్లీన్ చేయాలి. ఇలా వారానికి మూడుసార్లు ఇలా చేస్తే మంచి మంచి ఫలితాలు కనిపిస్తాయి. సమ్మర్ లో స్త్రీ పురుషులు సన్ టాన్ సమస్యతో ఇబ్బంది పడుతూ ఉంటారు.

మండే ఎండలో బయటికీ వెళ్ళాల్సి వచ్చినవారికి టానింగ్ పెద్ద సమస్య. దీని కోసం, గుప్పెడు పెసల్ని రాత్రంతా నీటిలో నానబట్టి పొద్దున్న మెత్తగా రుబ్బి అందులో చల్లటి పెరుగు గానీ, అలోవెరా జెల్ కానీ వేసి కలపాలి. ముఖం మీద, చేతుల మీద, టానింగ్ సమస్య ఎక్కడుంటే అక్కడ, ఈ మిశ్రమాన్ని అప్లై చేసి ఒక పదినిమిషాలు తరువాత చల్లని నీటితో కడిగేయాలి. జుట్టు ఊడిపోతున్నా, డ్రై అయిపోతున్నా జుట్టు డల్ గా ఉన్నా పెసలతో చేసే హెయిర్ పాక్ బాగా పనిచేస్తుంది. కాసిని పెసల్ని ఉడకబెట్టి రుబ్బి, ఇందులో గుడ్డు పచ్చసొన, కొంచెం నిమ్మరసం, పెరుగూ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకి పట్టించి 15 నిమిషాలు ఉంచాలి. మైల్డ్ షాంపూతో తలస్నానం చేసి జుట్టు ఆరబెట్టుకోవాలి వారానికి రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు కనిపిస్తాయి.