Site icon HashtagU Telugu

‎Blood Pressure: బీపీ,గుండెపోటు సమస్యలు రాకూడదంటే మీ డైట్ లో కచ్చితంగా ఈ ఫుడ్స్ చేర్చుకోవాల్సిందే!

Blood Pressure

Blood Pressure

‎Blood Pressure: ప్రస్తుత రోజుల్లో చాలామంది బీపీ గుండెపోటు వంటి సమస్యలతో బాధపడుతున్న విషయం తెలిసిందే. చిన్న వయసు వారు కూడా ఇలాంటి సమస్యల బారిన పడుతున్నారు. కొన్ని కొన్ని సార్లు ఈ సమస్యలు ప్రాణాలను సైతం తీస్తున్నాయి. ముఖ్యంగా రక్తపోటు సమస్యతో ఇబ్బంది పడే వారికి దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తాయట. బీపీ పెరగడం వల్ల గుండెపోటు, స్ట్రోక్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యల ప్రమాదం పెరుగుతుందట. వీటిని కంట్రోల్ చేసుకోవడానికి ఏ రకరకాల మెడిసిన్స్ ఉపయోగిస్తూ ఉంటారు. అయితే వాటితో పాటు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే కొన్ని ఫుడ్స్ ని తీసుకుంటే ఎలాంటి సమస్యలు రావు అని చెబుతున్నారు నిపుణులు.

‎మరి రక్తపోటును నియంత్రించి గుండె సమస్యలు రాకుండా చేసే ఆ ఫుడ్స్ ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మన డైట్ లో పాలకూరని చేర్చుకోవాలని చెబుతున్నారు. కాగా పాలకూరలో పొటాషియం, మెగ్నీషియం, నైట్రేట్లు పుష్కలంగా ఉంటాయి. ఈ మూలకాలు శరీరంలో సోడియం స్థాయిని సమతుల్యం చేయడానికి హెల్ప్ చేస్తాయట. దీనివల్ల రక్తపోటు కూడా నియంత్రణలో ఉంటుందట. అంతేకాకుండా పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా కలిగి ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యానికి సహాయపడుతుందట. కాగా గుండెపోటుకు ప్రధాన కారణం అధిక రక్తపోటు. కాబట్టి పాలకూర తింటే ఇందులో ఉండే నైట్రేట్లు రక్త నాళాలను సడలిస్తాయట.

‎రక్త ప్రవాహాన్ని కూడా మెరుగుపరుస్తాయట. ఇది గుండెపై ఒత్తిడిని తగ్గిస్తుందని, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని చెబుతున్నారు. అయితే పాలకూరను సలాడ్ రూపంలో తీసుకోవచ్చట. లేదా సూప్ తయారు చేసుకోవచ్చట. పాలకూర సూప్ అధిక బీపీ ఉన్నవారికి చాలా ఉపయోగకరంగా ఉంటుందని చెబుతున్నారు. పరగడుపున పాలకూరను జ్యూస్ చేసుకుని తాగడం వల్ల రక్తపోటును అదుపులో ఉంటుందట. బంగాళాదుంప పాలకూర లేదా పప్పు, పాలకూర వంటి వంటకాలు రుచికరంగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి కూడా మంచివని చెబుతున్నారు. పాలకూర కేవలం రక్తపోటును, గుండె సమస్యలను దూరం చేయడం మాత్రమే కాకుండా రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా హెల్ప్ చేస్తుందట. బరువును నియంత్రించడంలో సహాయపడుతుందట. ఎముకలు, కళ్లకు మేలు చేస్తుందట. అధిక రక్తపోటును నియంత్రించడానికి మందులతో పాటు ఆరోగ్యకరమైన ఆహారం చాలా ముఖ్యం. కాబట్టి పాలకూర వంటి సులభంగా లభించే కూరగాయలను తీసుకోవాలి. ఇవి రక్తపోటును సమతుల్యం చేయడమే కాకుండా గుండెపోటు ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయట..

Exit mobile version