Site icon HashtagU Telugu

Hair Growth: జుట్టు పెరగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నించి అలిసి పోయారా.. అయితే ఇవి తింటే నెల రోజుల్లో పెరగడం ఖాయం!

Hair Growth

Hair Growth

ప్రస్తుత రోజుల్లో స్త్రీ పురుషులు చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల్లో హెయిర్ ఫాల్ సమస్య కూడా ఒకటి. ఈ హెయిర్ ఫాల్ కారణంగా పురుషులు బట్టతల సమస్యతో బాధపడుతుంటే, మహిళలు పలుచని జుట్టు సమస్యతో బాధపడుతున్నారు. అయితే జుట్టు రాలడం ఆగిపోయి జుట్టు బాగా పెరగడం కోసం ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అందులో భాగంగానే రకరకాల హెయిర్ ఆయిల్స్ న్యాచురల్ పద్ధతులు కూడా ఫాలో అవుతూ ఉంటారు. అయినప్పటికీ మంచి ఫలితాలు కనిపించవు.

అయితే అలా హెయిర్ ఫాల్ సమస్యతో బాధపడుతున్న వారు ఇప్పుడు చెప్పబోయేవి తింటే జుట్టు బాగా పెరుగుతుంది అని చెబుతున్నారు. మరి అందుకోసం ఏం చేయాలో,ఏం తినాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కాగా డ్రై ఫ్రూట్స్ మన ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయన్న విషయం తెలిసిందే. అయితే మూడు డ్రై ఫ్రూట్స్ ముఖ్యంగా అత్తి పండు, డేట్స్, ఎండు ద్రాక్ష వీటిని కనుక రోజూ మీ డైట్ లో భాగం చేసుకుంటే. కచ్చితంగా మీ జుట్టు ఒత్తుగా పెరుగుతుందట. వీటిలో ఐరన్, మెగ్నీషియం, కాపర్, విటమిన్,విటమిన్ సి పుష్కలంగా ఉంటాయి. ఉదయం అల్పాహారంతో నానబెట్టిన 2 ఖర్జూరాలు, 2 అత్తి పండ్లను, 1 టేబుల్ స్పూన్ ఎండు ద్రాక్షను తినాలి. ఇది మీకు తక్షణ బలాన్ని ఇస్తుందట. అలాగే శరీరంలో ఐరన్ లెవెల్ సరిగ్గా ఉంటుందట. జుట్టు పెరుగుదలకు ఇది చాలా ముఖ్యం అని చెబుతున్నారు. వాల్నట్స్ ని కూడా తరచుగా తీసుకోవడం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుందట.

వాల్‌నట్‌ లు సెలీనియం కి మంచి మూలం, ఇది జుట్టు రాలడాన్ని నివారిస్తుందట. వాటిలో బయోటిన్ కూడా పుష్కలంగా ఉంటుందని,వీటిని తీసుకోవడం వల్ల జుట్టు రాలడం తగ్గుతుందని చెబుతున్నారు. రాగి పిండి కూడా జుట్టు పెరగడానికి ఎంతో బాగా ఉపయోగపడుతుంది. రాగి పిండిలో ఐరన్ క్యాల్షియం పోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా లభిస్తాయి. ఇవి జుట్టు పెరుగుదలకు ఇవన్నీ చాలా బాగా భయపడతాయి. మీరు రాగి పిండితో దోసె, సూప్, జావా ఇలా అనేక పదార్థాలను తయారు చేసుకోవచ్చు. కాబట్టి రాగి పిండిని ఏదో ఒక రూపంలో మీరు మీ ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు. కాగా దానిమ్మ కూడా జుట్టు పెరుగుదలకు ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో విటమిన్ కె, విటమిన్ సి, ఫైబర్, పొటాషియం , ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. అలాగే దానిమ్మ శరీరానికి ఇనుమును అందిస్తుంది. ఇందులో అధిక మొత్తంలో విటమిన్ సి ఉంటుంది. ఇది జుట్టు రాలడాన్ని తగ్గించడంలో,జుట్టు పెరుగుదలను పెంచడంలో సహాయపడుతుందని చెబుతున్నారు.