Summer Tips: వేసవిలో ఎలాంటి సన్ స్క్రీన్ ఉపయోగించాలో మీకు తెలుసా?

ప్రస్తుతం వేసవికాలం మొదలయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి సమ్మర్ లో ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా అందం విషయంలో కూడా జాగ్రత్తలు ప

  • Written By:
  • Publish Date - March 24, 2024 / 08:15 PM IST

ప్రస్తుతం వేసవికాలం మొదలయ్యింది. ఎండలు మండిపోతున్నాయి. కాబట్టి సమ్మర్ లో ఆరోగ్యం విషయంలో మాత్రమే కాకుండా అందం విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా ఎండ నుంచి చర్మాన్ని కాపాడుకోవడం కోసం ఏవేవో ప్రయత్నం చేస్తూ ఉంటారు. మరి వేసవి కాలంలో ఏం చేసి చర్మాన్ని రక్షించుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. లోషన్లు ముఖానికి రాసుకోవడం వల్ల ముఖం జిడ్డుగా ఉండి, చికాకు పుడుతుందని భావిస్తారు. కానీ, వేసవిలో తప్పకుండా సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. ఎందుకంటే సూర్యరశ్మిలో యూవీఏ, యూవీబీ కిరణాలు ఉంటాయి. అవిగానీ చర్మాన్ని నేరుగా తాకితే చిన్న వయస్సులోనే వృద్ధాప్య ఛాయలు వస్తాయి.

నల్ల మచ్చులు, ముడతలు వస్తాయి. చర్మ క్యాన్సర్లకు కూడా దారితీయవచ్చు. సూర్యరశ్మి నేరుగా తగలడం వల్ల ముఖం నల్లగా మారుతుంది. ఆ సమస్య రాకుండా ఉండాలంటే.. టైటానియం డై ఆక్సైడ్, జింక్ ఆక్సైడ్, ఆక్సీబెంజాన్, ఏవో బెంజాన్, మెక్సోరిల్ 5X ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు మాత్రమే వాడాలి. ఇవి మీ చర్మానికి రక్షణ కవచంలా కాపాడతాయి. అలాగే ఆ లోషన్లలో SPF శాతాన్ని కూడా చెక్ చేసుకోవాలి. అలర్జీలు, సున్నితమైన చర్మం ఉన్నవారు ఆల్కహాల్ కలిగిన లోషన్లు వాడకపోవడం ఉత్తమం. అలాగే చిన్నారులకు డై ఆక్సీబెంజాన్ ఉండే సన్‌స్క్రీన్ లోషన్లు వాడకూడదు. సున్నిత చర్మం కలిగిన వాళ్లు చర్మ వైద్యుల సూచన మేరకు 50 ప్లస్‌ సన్‌స్ర్కీన్‌ లోషన్స్‌ వాడాలి.

జిడ్డు చర్మం ఉన్నవాళ్లు మాయిశ్చరైజర్ లేని లోషన్లు ఎంచుకోవాలి. పొడిచర్మం ఉన్నవారు మాత్రం మాయిశ్చరైజర్ కలిగిన సన్‌స్క్రీన్ లోషన్లు వాడవచ్చు. ఇళ్లల్లో ఉన్నప్పుడు స్నానం చేసిన తర్వాత ఒకసారి రాసుకుంటే సరిపోతుంది. బయటకు వెళ్తున్నట్లయితే కనీసం 15 నుంచి 20 నిమిషాల ముందు సన్‌స్క్రీన్ లోషన్లు రాసుకోవాలి. బయట ఎక్కువ సేపు గడిపితే ప్రతి రెండు గంటలకు ఒకసారి లోషన్ రాసుకోడానికి ప్రయత్నించండి. దీనివల్ల చర్మానికి ఎక్కువ సేపు రక్షణ లభిస్తుంది. జిడ్డుగా ఉండటం ఇష్టంలేని వారు, లేదా జిడ్డు చర్మం ఉన్నవాళ్లు వాటర్‌ బేస్డ్‌ సన్‌స్ర్కీన్ లోషన్లు వాడవచ్చు. ముంజేతులు, మెడ, ఛాతీ దగ్గర కూడా సన్‌స్ర్కీన్‌ రాసుకోవాలి. పొడి చర్మం కలిగినవారు ముందుగా ముఖానికి మాయిశ్చరైజర్‌ అప్లై చేసి, ఆ తర్వాత సన్‌స్ర్కీన్‌ వాడాలి. ఇప్పుడు మాయిశ్చరైజర్ కలిగిని సన్‌స్క్రీన్ లోషన్లు కూడా మార్కెట్లో లభిస్తున్నయి.