Site icon HashtagU Telugu

Sunnundalu: సంక్రాంతి వంటకాలు.. రుచికరమైన సున్నుండ‌లను ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?

Mixcollage 11 Jan 2024 04 39 Pm 6647

Mixcollage 11 Jan 2024 04 39 Pm 6647

సంక్రాంతి పండుగకు మనం ఎన్నో రకాల వంటకాలు తయారు చేసుకుని తింటూ ఉంటాం. తరచుగా చేసే ఆహార పదార్థాలతో పాటు కొత్త కొత్త పిండి వంటలు కూడా తయారు చేసుకొని తింటూ ఉంటాం.. కొత్త అల్లుళ్ల కోసం పిండివంటలను ఎక్కువగా చేస్తూ ఉంటారు. అటువంటి వాటిలో సున్నుండలు కూడా ఒకటి. మరి సున్నుండలను ఎంతో రుచిగా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

సున్నుండలకు కావాల్సిన పదార్థాలు :

మిన‌ప్ప‌ప్పు – పావు కేజీ
పెస‌ర ప‌ప్పు – పావు కేజీ
బెల్లం – 400 గ్రాములు
ఏల‌కుల పొడి – ఒక టీ స్పూన్‌
నెయ్యి – 200 గ్రాములు

సున్నుండలు తయారీ విధానం:

ముందుగా బాణ‌లిలో నూనె లేకుండా మిన‌ప్ప‌ప్పు, పెస‌ర‌ప‌ప్పుల‌ను దోర‌గా వేయించాలి. వీటిని కలిపి కాకుండా విడివిడిగా వేయించుకోవాలి. ప‌ప్పులు చ‌ల్లారిన త‌ర్వాత క‌లిపి పొడి చేసి, తర్వాత బెల్లాన్ని పొడి చేసి అందులో ఏల‌కుల‌పొడి క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని మిన‌ప్పప్పు, పెస‌ర‌పిండి మిశ్ర‌మంలో క‌ల‌పాలి. అన్నీ స‌మంగా క‌లిసే వ‌ర‌కు క‌ల‌పాలి. చివ‌ర‌గా నెయ్యి వేసి క‌ల‌పాలి. ఇప్పుడు మ‌న‌కు కావాల్సిన సైజ్ లో ఉండ‌లు చేసుకోవాలి. నెయ్యి వాడ‌కాన్ని త‌గ్గించాల‌నుకునే వాళ్లు పిండిలో నెయ్యి వేయకూడ‌దు. పిండి మిశ్ర‌మాన్ని ఉండ‌లు క‌ట్టేట‌ప్పుడు కొద్దిగా నెయ్యి చేతికి రాసుకుంటూ ఉండాలి. అంతే రుచికరమైన సున్నుండలు రెడీ.