ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. ఉదయం 9 గంటలు దాటిన తర్వాత ప్రజలు ఇంటి నుంచి బయటకు రావాలి అంటేనే భయపడుతున్నారు. మధ్యాహ్న సమయంలో అయితే రోడ్లన్నీ కూడా జనసంచారం లేక ఖాళీగానే ఉంటున్నాయి. అందుకే వైద్యులు కూడా ఎంతో అవసరమైతే తప్ప మధ్యాహ్న సమయంలో బయటికి రాకపోవడమే మంచిదని చెబుతున్నారు. అయితే ఇలా ఎండల్లో చర్మాన్ని కాపాడుకోవడం కోసం చాలామంది ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. మరి ముఖ్యంగా సన్ స్క్రీన్ అప్లై చేసుకుని బయటకు వెళ్తూ ఉంటారు. అయితే రెండు మూడు గంటల తర్వాత మళ్లీ సన్ స్క్రీన్ ను రాసుకోవాల్సిందే.
కానీ ఆ అవసరం లేకుండా ఇప్పుడు చెప్పబోయే చిట్కాలు పాటిస్తే మీ చర్మం ఆరోగ్యంగా ఉంటుందని చెబుతున్నారు. ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అలోవెరా జెల్ ఇందుకు ఎంతో బాగా ఉపయోగపడుతుందట. కలబందలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని చల్లబరుస్తాయట. అంతే కాకుండా వడదెబ్బ నుండి రక్షించడంలో సహాయపడతాయని చెబుతున్నారు. ఎండలో బయటకు వెళ్ళే ముందు ముఖంపై కాస్త కలబంద జెల్ అప్లై చేయాలట. ఇది చర్మంపై సహజమైన కవచాన్ని సృష్టిస్తుందట. ఫలితంగా సూర్య కిరణాల నుండి రక్షిస్తుందని, ఇలా తరచుగా చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుందని,ఎండ నుండి చర్మానికి రక్షణ లభిస్తుందని చెబుతున్నారు. అలాగే కొబ్బరి నూనె సహజ SPF లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది చర్మాన్ని తేలికపాటి సూర్యకాంతి నుండి కాపాడుతుందట.
అంతే కాకుండా ఇది చర్మాన్ని హైడ్రేటెడ్ గా మారుస్తుందట. ఎండ దెబ్బతినకుండా కాపాడుతుందట. ప్రకాశవంతమైన చర్మం కోసం కొబ్బరి నూనె వాడటం చాలా మంచిది. తరచుగా కొబ్బరి నూనె వాడటం వల్ల సమ్మర్ లో కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుందట. అలాగే దోసకాయలో 96శాతం నీరు ఉంటుంది. ఇది చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుతుందట. అంతే కాకుండా సమ్మర్ లో వచ్చే మంట నుండి రక్షిస్తుందట. ఎండలో బయటకు వెళ్ళే ముందు దోసకాయ రసాన్ని ముఖానికి రాసుకుంటే అది చర్మాన్ని చల్లబరుస్తుందట. అంతే కాకుండా హానికరమైన కిరణాల నుండి కూడా కాపాడుతుందని చెబుతున్నారు. బాదం నూనెలో విటమిన్ ఇ పుష్కలంగా ఉంటుంది. ఇది చర్మాన్ని హానికరమైన కిరణాల నుండి రక్షించడంతో పాటు తేమను అందిస్తుందట. కొన్ని చుక్కల బాదం నూనె తీసుకుని ముఖంపై మసాజ్ చేస్తే చర్మం ఆరోగ్యంగా, మెరుస్తూ ఉంటుందని చెబుతున్నారు.