Site icon HashtagU Telugu

Summer Tips: వేసవిలో ఈ ఏడు టిప్స్ పాటిస్తే చాలు.. మెరిసే చర్మం మీ సొంతం!

Mixcollage 09 Mar 2024 05 51 Pm 6741

Mixcollage 09 Mar 2024 05 51 Pm 6741

వేసవికాలం వచ్చింది అంటే చాలు చర్మానికి సంబంధించిన ఎన్నో రకాల సమస్యలు మొదలవుతాయి. ఎండాకాలంలో ఇంట్లో ఉన్నా, ఆఫీసులో సెంట్రల్ ఏసీలో ఉన్నా వేడిగానే ఉంటుంది. మన దేశంలో పొడి వాతావరణం ఎక్కువ కాబట్టి ఎండలు దంచేస్తాయి. ఇలాంటి సమయంలో బయటకు వెళ్లాల్సి వస్తే నిప్పుల్లోంచీ వెళ్తున్నట్లే ఉంటుంది. కానీ ఎన్నో పనుల కోసం బయటకు వెళ్లక తప్పదు. ఫలితంగా మన చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడతాయి. ముఖంపై మొటిమలు కూడా వచ్చేస్తాయి. ముఖ్యంగా మిట్ట మధ్యాహ్నం సమయంలో చాలామంది బయటకు వెళ్లాలి అంటేనే భయపడుతూ ఉంటారు.

కాగా కీర దోసకాయ వేసవిలో బాగా దొరుకుతుంది. ఇది మన చర్మాన్ని కాపాడగలదు. ఇది చర్మాన్ని కాపాడటమే కాదు మనల్ని ఆరోగ్యంగా ఉంచగలదు. ఎండల వేడి నుంచి ఉపశమనం కలిగిస్తుంది. ఇందులో నీరు ఎక్కువ కాబట్టి. దీన్ని తినడం వల్ల చర్మంలో నీటి సాంద్రత ఉండి, డీ-హైడ్రేట్ అవ్వకుండా ఉంటాం. కీర దోసకాయలో పొటాషియం, మెగ్నీషియం మూలకాలు ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తాయి. ఇందులోని నీరు బాడీలో రక్తం పరిమాణాన్ని పెంచుతుంది. ఫలితంగా ఎండలో తిరిగినా మనం వెంటనే నీరసించిపోకుండా బలంగా ఉంటాం. కీరదోసకాయ గింజల్లో పొటాషియం, విటమిన్ ఈ ఉంటాయి.

ఇవి చర్మాన్ని కాపాడుతూ ముడుతలు పడకుండా, కమిలి పోకుండా చేస్తాయి. కొన్ని కీరదోసకాయ గింజల్ని నీటిలో కలిపి రెగ్యులర్‌గా తినాలి. తద్వారా మీ చర్మం ఎంతో అందంగా కోమలంగా ఉంటుంది. కీర దోసకాయ చలవ చేస్తుంది. ఇది తింటే పొట్టలో చల్లదనం వస్తుంది. గాలి పీల్చి, వదలడంలో కూడా ఇది సాయపడుతుంది. శ్వాస ప్రక్రియ బాగా పని చేస్తుంది. మీ నాలికపై కీర దోసకాయ ముక్కను 30 సెకండ్లు ఉంచండి. ఇది అక్కడి చెడు బ్యాక్టీరియాను చంపేస్తుంది. ఫలితంగా నోటి నుంచి చెడు వాసనలు రాకుండా ఆగిపోతాయి. కీరదోసకాయను జ్యూస్‌లా చేసి చర్మంపై రాసుకోండి. ఇందులోని పొటాషియం… చర్మాన్ని శుభ్రం చేస్తుంది. మృదువైన చర్మాన్ని ఇస్తుంది. దీని వల్ల మీరు వయసు తగ్గిపోయిన వారిలా కనిపిస్తారు.

అందుకే కాస్మొటిక్ కంపెనీలు కీర దోసకాయల్ని ఫేస్ క్రీముల్లో ఇతర ఉత్పత్తుల్లో తెగ వాడుతున్నాయి. మీ కంటి చుట్టూ నల్లటి చారలు ఉంటే కీర దోసకాయ మీకు సాయం చెయ్యగలదు. రెండు కీర దోసకాయ స్లైసెస్‌ని సన్నగా కట్ చేసుకొని, కళ్ళపై ఉంచుకోవాలి. పదినిమిషాలు ఇలా ఉంచాలి. రోజూ ఇలా చేస్తే మీ కంటి చుట్టూ ఉన్న నల్ల చారలు పోతాయి.
కీర దోసకాయ జ్యూస్‌లో నిమ్మరసం కలపండి. ముఖానికి రాసుకోండి. 15 నిమిషాలు ప్రశాంతంగా ఉండండి. ఇప్పుడు చల్లటి నీటితో ముఖాన్ని కడిగేసుకోండి. మీ చర్మంపై నల్లటి మచ్చలను ఇది పోగొట్టేస్తుంది.