Hair Problems: తెల్లజుట్టు సమస్యతో ఇబ్బంది పడుతున్నారా.. అయితే ఇలా చేయాల్సిందే?

ఈ రోజుల్లో చాలామంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారు కూడా ఈ తెల్ల జు

  • Written By:
  • Publish Date - January 15, 2024 / 06:30 PM IST

ఈ రోజుల్లో చాలామంది తెల్ల జుట్టు సమస్యలతో బాధపడుతున్న విషయం మనందరికీ తెలిసిందే. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసు వారు కూడా ఈ తెల్ల జుట్టు సమస్యతో సతమతమవుతున్నారు. తెల్ల జుట్టు కారణంగా సన్నా వయసులోనే పెద్దవారిలా కనిపిస్తూ ఉండడంతో చాలామంది నలుగురులోకి వెళ్లాలి అన్న కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇక ఈ తెల్ల జుట్టును కవర్ చేసుకోవడానికి అనేక రకాల హెయిర్ కలర్స్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అవి కేవలం తాత్కాలికంగా మాత్రమే పనిచేస్తాయి. మరి అలాంటప్పుడు ఎటువంటి చిట్కాలు ఉపయోగించి తెల్ల వెంట్రుకల సమస్యలకు చెక్ పెట్టవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ముందుగా స్టవ్ పై ఒక గిన్నె పెట్టి అందులో ఒక గ్లాసు వాటర్ పోయాలి. తర్వాత అందులో కొంచెం టీ పౌడర్ వేయాలి. తర్వాత నాలుగైదు లవంగాలు, ఒక రెండు బిర్యానీ ఆకులు వేవాలి. ఆపై వాటిని బాగా మరిగించాలి. అనంతరం స్టవ్ ఆఫ్ చేయాలి. ఆ నీటిని ఒక గిన్నెలోకి వడకట్టాలి. మరో గిన్నెలో రెండు లేదా మూడు స్పూన్ల వరకు హెన్నా పౌడర్ తీసుకోవాలి. ఇంతకు ముందు మరిగించిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఇందులో కలుపుతూ మిక్స్ చేసుకోవాలి. పేస్టుగా మారే వరకు కలిసి మూత పెట్టెయ్యాలి. దీనిని మూడు నుంచి నాలుగు గంటల వరకు అలాగే ఉంటాలి.

తర్వాత దానిని వెంట్రుకలకు అప్లై చేయాలి. సుమారు 20 నిమిషాల తర్వాత తల స్నానం చేయాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. దీని వల్ల జుట్టు సమస్య తగ్గి వెంట్రుకలు ఆరోగ్యంగా ఉంటాయి. ఇలా చేయడంతో పాటు తెల్ల జుట్టు సమస్యతో బాధపడుతున్న వారు మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్ హెయిర్ కలర్స్ ని ఉపయోగించడం వల్ల కూడా ఆ సమస్య మరింత ఎక్కువ అవుతూ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు నేచురల్ టిప్స్ ని పాటించడం మంచిది..