Low BP: లో బీపీతో సతమతమవుతున్నారా? ఈ జాగ్రత్తలు తప్పనిసరి?

ప్రస్తుత రోజుల్లో బీపీ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. కొందరు హైబీపీ సమస్యతో బాధపడితే మరి కొందరు లో

Published By: HashtagU Telugu Desk
Low BP

Low BP

ప్రస్తుత రోజుల్లో బీపీ సమస్య ప్రధాన సమస్యగా మారిపోయింది. కొందరు హైబీపీ సమస్యతో బాధపడితే మరి కొందరు లో బీపీ సమస్యతో బాధపడుతూ ఉంటారు. అయితే సాధారణంగా హై బీపీ ఎంత డేంజర్ లో బీపీ కూడా అంతే డేంజర్. లో బీపీ సమస్యతో బాధపడేవారు మెడిసిన్స్ ఉపయోగించకపోయిన కొన్ని రకాల హెల్త్ చిట్కాలను పాటించడం ద్వారా లో బీపీ సమస్య నుంచి బయటపడవచ్చు. లో బీపీ సమస్య ఉంటే.. శ్వాస తీసుకోవడం ఇబ్బంది కలగడం, ఆలోచనలు గందరగోళంగా ఉండడం, నిరాశతో ఉండటం, తరచూ తలనొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి.

అలాగే చిన్న గాయం అయినా కూడా రక్తం ఎక్కువగా కారుతుంది. అంతేకాకుండా గుండెకు సంబంధించిన వ్యాధులు అనగా గుండెపోటు వంటి ప్రాణాంతక సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. మరి లోబీపీ సమస్యను తగ్గించుకోవాలంటే ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..లో బీపీ ఉన్నవారు ప్రతిరోజు ఏడు నుంచి ఎనిమిది గ్లాసుల నీటిని తాగాలి. చాలామంది బీపీ తక్కువగా ఉందని ఉప్పు ఎక్కువగా తింటూ ఉంటారు. అలా ఉప్పు ఎక్కువగా తినడం వల్ల అనేక రకాల ప్రమాదకరమైన వ్యాధులు వస్తాయి. బీపి తక్కువగా ఉండే వారికి ఫోలిక్ యాసిడ్, ఐరన్, విటమిన్ బి 12 వంటి ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి.

కొబ్బరి నీళ్లు కూడా ఎంతో బాగా సహాయపడతాయి. తక్కువ నిద్రపోయిన లేకపోతే నిద్రలేమి సమస్యతో బాధపడే వారికి లో బీపీ సమస్య వస్తుంది. అటువంటి వారు ఎక్కువగా పండ్ల రసాలు తీసుకోవడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు. మరి ముఖ్యంగా బీట్రూట్ దానిమ్మ వంటి పండ్లరసాలు తీసుకోవాలి. టొమాటోలు, కీరదోస, ముల్లంగి, ఎర్ర క్యాప్సికం, క్యాబెజీ, పాప్ కార్న్, చికెన్, చీజ్, గుడ్లు, పొద్దు తిరుగుడు గింజలు, క్యారెట్లు, బ్రోకలి, ముల్లంగి లాంటివి తినడం వల్ల అవి బీపీని పెంచడానికి సహాయపడతాయి. బీపీ తగ్గినప్పుడు సోడియం కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడవచ్చు.

  Last Updated: 25 Nov 2022, 06:51 AM IST