Life Expectancy : చదువు ఆయుష్షును కూడా పెంచుతుంది : రీసెర్చ్ రిపోర్ట్

Life Expectancy : చదువుకోవడానికి విద్యాసంస్థలకు వెళితే.. జీవితంలో ఎదగడంతో పాటు ఆయుష్షులోనూ ఇంక్రిమెంట్‌ను పొందొచ్చట. 

  • Written By:
  • Publish Date - January 30, 2024 / 08:33 AM IST

Life Expectancy : చదువుకోవడానికి విద్యాసంస్థలకు వెళితే.. జీవితంలో ఎదగడంతో పాటు ఆయుష్షులోనూ ఇంక్రిమెంట్‌ను పొందొచ్చట.  ఈవిషయం ప్రతిష్ఠాత్మక ‘ది లాన్సెట్ పబ్లిక్ హెల్త్’ జర్నల్‌ అధ్యయన నివేదికలో తాజాగా వెల్లడైంది. పాఠశాల లేదా కాలేజీలో విద్యార్థులు ఎన్ని సంవత్సరాలు గడుపుతున్నారో .. అంతమేర సగటు ఆయుష్షు పెరుగుతోందని నార్వేజియన్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీకి(NTNU) చెందిన పరిశోధకుల స్టడీలో తేలింది. 59 దేశాల్లో ప్రచురితమైన 600 ఆర్టికల్స్‌ నుంచి సేకరించిన 10 వేల డేటా పాయింట్లను క్రోడీకరించి ఈ అధ్యయన నివేదికను రూపొందించారు. దీని  ప్రకారం.. విద్యా సంస్థల్లో గడిపిన కాలంలో ఏటా  2 శాతం చొప్పున మరణం ముప్పు(Life Expectancy) తగ్గుతోంది. ఆ లెక్కన ఆరేళ్ల ప్రాథమిక విద్యాభ్యాసం పూర్తిచేసిన వారికి సగటున 13 శాతం, గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసినవారికి 18 ఏళ్ల అభ్యసన కాలానికిగానూ 34 శాతం మరణం ముప్పు తగ్గుతోంది. 18 ఏళ్లపాటు తగినన్ని కూరగాయలతో కూడిన ఆరోగ్యకర ఆహారం తీసుకుంటే ఎంతైంతే ఆరోగ్య ప్రయోజనం చేకూరుతుందో.. అంతేకాలం పాటు చదువుకున్నవారికీ అదే స్థాయిలో ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతోంది. వెరసి ఆయుష్షు పెరుగుతోంది. పదేళ్లపాటు రోజూ 10 సిగరెట్లు లేదా 5 దఫాలుగా మద్యం తీసుకుంటే ఆరోగ్యానికి ఎంతైతే నష్టం కలుగుతుందో.. అసలు విద్యాసంస్థకు వెళ్లని వారికి  ఆరోగ్యం అంతగా ఇబ్బందికరంగా మారే రిస్క్ ఉంటుంది.

We’re now on WhatsApp. Click to Join.

జపాన్ ప్రజల నూరేళ్ల ఆయుష్షుకు ఐదు ఫుడ్ ఐటమ్స్ 

మిషో సూప్

పులియబెట్టిన సోయా నుండి మిషో సూప్ తయారుచేస్తారు. ఇందులో ప్రోబయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ప్రేగుల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉదర సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. జీర్ణ ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

స్వీట్ పొటాటో

చిలగడదుంపలను స్వీట్ పోటాటో అని కూడా పిలుస్తారు. భారతదేశంలో చిలగడదుంపలను బాగా పండిస్తారు. చిలగడదుంపలలో ఆంథోసైనిన్ అనే యాంటీఆక్సిడెంట్ పెద్ద మొత్తంలో ఉంటుంది. ఇది యాంటీ క్యాన్సర్, యాంటీ డయాబెటిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ మైక్రోబయల్, యాంటీ ఒబేసిటీ ప్రభావాలు కలిగి ఉంటుంది.

డైకాన్ ముల్లంగి

డైకాన్ ముల్లంగి సాధారణ ముల్లంగి కంటే కొంచెం భిన్నంగా ఉంటుంది. ఇందులో అధికమొత్తంలో విటమిన్-సి ఉంటుంది. దీన్ని రెగ్యులర్ గా తీసుకుంటే రోగనిరోధక శక్తి బలపడుతుంది. ఈ కారణంగా శరీరం ఎలాంటి జబ్బులను అయినా ఎదుర్కోగలుగుతుంది.

సీవీడ్

సముద్రపు పాచిని సీవీడ్ అని అంటారు. ఇది చాలా శక్తివంతమైన ఆహారం. సీవీడ్‌లో విటమిన్ ఎ, సి, ఇ, కెరోటినాయిడ్లు, ఫ్లేవనాయిడ్స్ వంటి యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరాన్ని సెల్ డ్యామేజ్ నుండి రక్షిస్తాయి. ఇది కాకుండా, శరీరం మెరుగ్గా పనిచేయడానికి అవసరమైన అన్ని రకాల ఖనిజాలు ఇందులో ఉంటాయి.

చేపలు

ఎక్కువకాలం బ్రతకాలంటే చేపలు తినడం బెస్ట్ అని ఆహార నిపుణులు అంటున్నారు. జపాన్ ప్రజలు కూడా చేపలను ఎక్కువగా తింటారు. . చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్‌లు ఉంటాయి. ఇవి మెదడు ఆరోగ్యానికి మేలు చేస్తాయి. ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు ఆరోగ్యకరమైన కొవ్వులు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.

Also Read : Shamar Joseph : రెండేళ్ల క్రితం సెక్యూరిటీ గార్డ్.. ఇప్పుడు స్టార్ బౌలర్