ప్రస్తుత పరిస్థితుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరికీ ఒత్తిడి అనేది ఉంటుంది. ఒత్తిడి లేని మనిషి ఉండడు. కానీ ఆ ఒత్తిడి ఎక్కువైతే రోగాలు వస్తాయని, ఒత్తిడి తగ్గించుకోవాలని వైద్యులు చెప్తూనే ఉంటారు. ఇక అలాంటి ఒత్తిడి తగ్గాలంటే ఇక్కడ చెప్పే కొన్ని చిట్కాలను పాటించండి.. ఒత్తిడి తగ్గి ప్రశాంతంగా ఉంటారు..
వర్క్ ఫ్రమ్ హోమ్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికీ ఇంటి నుంచే పని. ఇక ఆ ల్యాప్‌టాప్‌ల ముందు ఉదయం కూర్చుంటే సాయంత్రం వరకు ఒకటే పని. కనీసం లేవడానికి సమయం ఉండదు.. లేవాలని కూడా అనిపించదు. కానీ.. నిరంతరం కూర్చుని పని చేయడం వల్ల ఒత్తిడి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది. అందుకే గంటకు ఒకసారైనా అలా ఐదు నిమిషాలు నడవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.
ఉదయం ఒకసారి.. సాయంత్రం ఒకసారి కాఫీ లేదా గ్రీన్ టీ తాగితే ఒత్తిడి నుంచి రిలాక్స్ అవుతారు. పది నిమిషాలు నడిస్తే ఒత్తిడి తగ్గి పనిపై శ్రద్ధ పెట్టొచ్చు. అలసటగా, నీరసంగా అనిపిస్తే కూర్చుని పని చేసే చోటే ధ్యానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇవి మాత్రమే కాదు, కాసేపు మనసుకు నచ్చిన మ్యూజిక్ విన్నా, స్నేహితులతో కాసేపు ఫోన్‌లో మాట్లాడినా ఒత్తిడి నుంచి విముక్తులై ప్రశాంతంగా ఉంటారు.
