Site icon HashtagU Telugu

Stress : పిల్లల నుండి పెద్దల వరకు అందరికి ఇదే సమస్య..నిర్లక్ష్యం చేస్తే అంతే సంగతి

Stress

Stress

ఈ రోజుల్లో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు మానసిక ఒత్తిడి (Stress ) అనేది సాధారణ సమస్యగా మారింది. చదువులు, ఉద్యోగ పోటీ, ఆర్థిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు ఇలా ఇవన్నీ కలిసి మన మనస్సుపై తీవ్రమైన ఒత్తిడిని మోపుతున్నాయి. ఈ ఒత్తిడిని నిర్లక్ష్యం చేస్తే ఇది మన శారీరక, మానసిక ఆరోగ్యాన్ని నాశనం చేసే ప్రమాదం ఉంది. అందుకే దీనిపై డాక్టర్స్ (Doctors ) ఏమంటున్నారంటే.. చిన్నారులు చదువుల ఒత్తిడితో, తల్లిదండ్రుల అంచనాలతో, పోటీ ప్రపంచం వల్ల మానసికంగా సతమతమవుతున్నారు. దీనికితోడు మొబైల్ ఫోన్ల వాడకం వల్ల నిద్రలేమి వల్ల ఒత్తిడిని పెంచుతోంది.

Maganti Gopinath : బిఆర్ఎస్ ఎమ్మెల్యే ఆరోగ్యం విషమం..హాస్పటల్ కు వెళ్తున్న నేతలు

ఇక పెద్దల విషయానికొస్తే.. ఉద్యోగ భద్రతా సమస్యలు, ఖర్చుల పెరుగుదల, అనారోగ్య సమస్యలు, వ్యక్తిగత సంబంధాలలో కలహాలు వీటన్నింటి వల్ల ఒత్తిడి నానాటికీ పెరుగుతోంది. అందుకే ధ్యానం మరియు యోగా ద్వారా మానసిక ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. రోజూ కనీసం 15-20 నిమిషాలు ప్రాణాయామం చేయడం, సంతులిత ఆహారం తీసుకోవడం, నిద్రపోవడం, అవసరమైనప్పుడు ప్రియమైన వారితో మాట్లాడటం లేదా డైరీలో భావాలు రాయడం వంటి చర్యలు ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి. చిన్న మార్పులతో పెద్ద సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలంటే వీలైనంత ఒత్తిడిని తగ్గించుకోవాలి.