Strawberry: స్ట్రాబెర్రీతో ముఖంపై ముడతలు తొలగించుకోండిలా?

స్ట్రాబెర్రీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పొటాషియం అలాగే ఇతర ఖని

  • Written By:
  • Publish Date - September 11, 2023 / 09:40 PM IST

స్ట్రాబెర్రీ వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం మనందరికీ తెలిసిందే. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు పొటాషియం అలాగే ఇతర ఖనిజాలు కూడా పుష్కలంగా లభిస్తాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే స్ట్రాబెర్రీ కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా అందానికి కూడా ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ముఖంపై ముడతలను పోగొట్టడానికి సహాయపడతాయి. స్ట్రాబెర్రీ లో 90 శాతం వాటర్ కంటెంట్ ఉంటుంది. అలాగే విటమిన్ సి కూడా అధికంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఈ పండు కొలెస్ట్రాల్ ను వదిలించుకోవడానికి, అధిక రక్తపోటును నియంత్రించడానికి, మధుమేహాన్ని నివారించడానికి ఎంతో సహాయపడుతుంది.

అలాగే స్ట్రాబెర్రీలు చర్మాన్ని మృదువుగా, అందంగా మార్చడానికి, మొటిమలను నివారించడానికి, చర్మంపై ముడతలను తొలగించడానికి, చర్మాన్ని అందంగా చేయడానికి సహాయపడతాయి. మరి స్ట్రాబెరీ వల్ల ఇంకా ఎటువంటి ప్రయోజనాలు ఉన్నయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మొదట స్ట్రాబెర్రీని తీసుకొని జ్యూస్ లా చేసి అందులో ఒకటిన్నర టేబుల్ స్పూన్ పెరుగు, టేబుల్ స్పూన్ తేనె వేసి బాగా కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి, మొడకు బాగా అప్లై చేసి 15 నుంచి 20 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత గోరువెచ్చనీటితో కడిగేయాలి. ఇలా చేయడం వల్ల నల్లని మచ్చలు మొటిమల సమస్య తగ్గిపోతుంది. చర్మం కాంతివంతంగా అవుతుంది.

మరొక రెమిడి విషయానికి వస్తే.. రెండు టేబుల్ స్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం వేసి మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయాలి. 15 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేయడం వల్ల వడదెబ్బ సమస్య నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు. అలాగే రెండు టేబుల్ స్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ లో ఒక టీస్పూన్ బియ్యప్పిండి, రెండు టీస్పూన్ల పెరుగును కలపండి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత కడిగేయండి. ఇది మీ ముఖాన్ని కాంతివంతంగా చేయడానికి సహాయపడుతుంది.

స్ట్రాబెర్రీల జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ శెనగపిండిని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల తర్వాత నీట్ గా కడిగేయండి. ఈ ప్యాక్ జిడ్డుగల చర్మాన్ని తొలగించడానికి, చర్మాన్ని ప్రకాశవంతం చేయడానికి, రంగును మెరుగుపర్చడానికి సహాయపడుతుంది. రెండు టేబుల్ స్పూన్ల స్ట్రాబెర్రీ జ్యూస్ లో ఒక టేబుల్ స్పూన్ తేనెను మిక్స్ చేసి ముఖానికి అప్లై చేయండి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని నీట్ గా కడిగేసుకోండి. ఈ ప్యాక్ మొటిమలను వదిలించుకోవడానికి, మీ ముఖం మెరిసేలా చేయడానికి సహాయపడుతుంది.