Spongy Rasgulla: ఎంతో టేస్టీగా ఉండే స్పాంజీ రసగుల్లా.. ఇంట్లోనే చేసుకోండిలా?

మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది స్వీట్లను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇంట్లో తయారు చేసే స్వీట్లు తో పాటు బ్రేకర

Published By: HashtagU Telugu Desk
Mixcollage 17 Mar 2024 07 26 Pm 2542

Mixcollage 17 Mar 2024 07 26 Pm 2542

మామూలుగా చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలామంది స్వీట్లను ఎక్కువగా ఇష్టపడి తింటూ ఉంటారు. ఇంట్లో తయారు చేసే స్వీట్లు తో పాటు బ్రేకరిలో ఎన్నో రకాల స్వీట్లు కొనుగోలు చేసి మరి తింటూ ఉంటారు. కానీ ఇంట్లో అమ్మలు మాత్రం బ్రేకరీలో తయారు చేసే స్వీట్లు కొనివ్వడానికి అంతగా ఇష్టపడరు. ఇంట్లో తయారు చేసిన వాటిని తినాలని చెబుతూ ఉంటారు. మహిళలు బ్రేకరీ స్టైల్ లో ఉండే స్వీట్లు తయారు చేయాలని అనుకుంటూ ఉంటారు. అటువంటి వాటిలో స్పాంజీ రసగుల్లా కూడా ఒకటి.

కావాల్సిన పదార్థాలు:

పాలు – ఒక లీటరు
నిమ్మరసం – అరస్పూను
పంచదార – రెండు కప్పులు
నీళ్లు – ఒక లీటరు
యాలకుల పొడి -అరస్పూను

తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పాలను మరగబెట్టాలి. మరిగాక నిమ్మరసం కలపాలి. చిన్నమంట మీద పాలను మరిగిస్తే పాలు విరుగుతాయి. ఒక వస్త్రంలో పాలను వడకట్టి, గట్టిగా మూటలా కట్టి కాసేపు ఉంచాలి. నీరంతా పోయాక ఆ ముద్దని చేతులతో బాగా నొక్కి మెత్తటి పేస్టులా చేసుకోవాలి.
తరువాత గుండ్రని ఉండలుగా చుట్టుకోవాలి. మరోపక్క రెండు కప్పు పంచదార, ఒక లీటరు నీళ్లు వేసి మరిగించాలి. అందులో యాలకుల పొడి కలపాలి. పంచదార కరిగి సలసల మరుగుతున్నప్పుడు అందులో ముందుగా చుట్టుకున్న ఉండలను వేసుకోవాలి. పైన మూత పెట్టి ఒక పది నిముషాల తరువాత మూత తీసేసి, స్టవ్ కట్టేయాలి. నాలుగైదు గంటలు పక్కన వదిలేయాలి. అంతే ఎంతో టేస్టీగా ఉండే స్పాంజి లాంటి రసగుల్లా రెడీ.

  Last Updated: 17 Mar 2024, 07:27 PM IST