Spicy Egg Kurma: స్పైసీ ఎగ్ కుర్మా.. ఇంట్లోనే సింపుల్ గా చేసుకోండిలా?

మామూలుగా మనము గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఆమ్లెట్, ఎగ్ బిర్యానీ, ఎగ్ బోండా ఇలా చెప్పు

Published By: HashtagU Telugu Desk
Mixcollage 18 Dec 2023 05 22 Pm 6401

Mixcollage 18 Dec 2023 05 22 Pm 6401

మామూలుగా మనము గుడ్డుతో ఎన్నో రకాల రెసిపీలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. ఎగ్ రైస్, ఎగ్ నూడిల్స్, ఆమ్లెట్, ఎగ్ బిర్యానీ, ఎగ్ బోండా ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే రెసిపీస్ ఉన్నాయి. అయితే ఎప్పుడైనా మీరు ఎగ్ కుర్మా తిన్నారా. తినకపోతే ఇంట్లోనే సింపుల్గా స్పైసీ ఎగ్ కుర్మాని ఎలా తయారు చేసుకోవాలో,అందుకు ఏ ఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

ఎగ్ కుర్మాకి కావలసిన పదార్థాలు

ఉడికించిన కోడిగుడ్లు – నాలుగు
ఉల్లిపాయలు – రెండు
పచ్చిమిర్చి – ఆరు
పాలు – ఒకటిన్నర కప్పు
జీలకర్ర – 3 టీ
ఆవాలు – ఒక టీ
కొత్తిమీరపొడి – 2 టీ
ధనియాలు – ఒక టీ
గరం మసాలా పొడి – రెండు స్పూన్
నూనె – తగినంత
ఉప్పు – సరిపడా

ఎగ్ కుర్మా తయారీ విధానం:

ఇందుకోసం ముందుగా పచ్చిమిర్చి, జీలకర్రలను కలిపి కాసిన్ని నీళ్లుచేర్చి మిక్సీలో మెత్తగా రుబ్బుకోవాలి. తర్వాత స్టవ్‌పై బాణలి ఉంచి, నూనె పోసి, వేడయ్యాక ఆవాలు, ధనియాలు వేసి రంగు మారేదాకా వేయించి, ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసి వేయించాలి. తరువాత అందులోనే పచ్చిమిర్చి ముద్దను కూడా చేర్చి 5 నిమిషాలు ఉడికించాలి. ఆపై అందులో పాలుపోసి కలియబెట్టాలి. ఈ మిశ్రమం ఉడుకుతుండగా అందులో ఉడికించిన కోడిగుడ్లు వేసి మూతపెట్టి సన్నటి సెగపై ఉడికించాలి. కూర దగ్గరవుతుండగా, అందులో తగినంత ఉప్పు, గరంమసాలా పొడి, కొత్తిమీర పొడి వేసి కలపాలి. అలాగే మరో ఐదు నిమిషాలు ఉడికించి దించేయాలి. అంతే రుచికరమైన స్పైసీ ఎగ్ కుర్మా రెడీ..

  Last Updated: 18 Dec 2023, 05:23 PM IST