Site icon HashtagU Telugu

Spicy Chicken Masala Rice: స్పైసీ చికెన్ మసాలా రైస్.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే?

Spicy Chicken Masala Rice Recipe Process

Spicy Chicken Masala Rice Recipe Process

మామూలుగా మనం చికెన్ తో ఎన్నో రకాల ఆ రెసిపీలు తయారు చేసుకొని తింటూ ఉంటాం.. అయితే ఎప్పుడూ ఒకే విధమైన వంటలు కాకుండా కొత్త కొత్త రెసిపీలు ట్రై చేయాలని చాలా మంది అనుకుంటూ ఉంటారు. మరి ఎంతో స్పైసీగా ఉండే స్పైసీ చికెన్ మసాలా రైస్ లో ఎప్పుడైనా ట్రై చేశారా.. ఒకవేళ తినకపోతే ఈ రెసిపీని ఇంట్లోనే టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావలసిన పదార్ధాలు:

బోన్లెస్ చికెన్ – అర కేజీ
పచ్చిమిర్చి – రెండు
టమాటా – ఒకటి
కరివేపాకు – ఒక రెమ్మ
ఎగ్స్ – రెండు
ఉప్పు, కారం – తగినంత
పుదీనా – పావుకప్పు
కొత్తిమీర – పావు కప్పు
ఉల్లిపాయ – ఒకటి
గరం మసాలా పొడి – ఒక టీ స్పూన్
పసుపు – కొంచెం
నూనె – రెండు టేబుల్ స్పూన్స్
అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్
అన్నం – రెండు కప్పులు
లవంగాలు – మూడు
దాల్చిన చెక్క – చిన్న ముక్క
షాజీర – కొద్దిగా

తయారీ విధానం :

ఇందుకోసం ముందుగా చికెన్ ను సన్నగా కట్ చేసుకుని శుభ్రం చేసి కడిగి కొద్దిగా ఉప్పు, కారం, వేసి ఉడికించి ఉంచుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి కొంచం నూనె వేడి చేసి అందులో ఎగ్స్ పగలు కొట్టి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. తరువాత అందులోనే నూనె వేసి లవంగాలు, చెక్క, షాజీర వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి వేసి దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు కరివేపాకు, తరిగిన టమాటా ముక్కలు వేసి మగ్గనివ్వాలి. తరువాత సన్నగా తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి వేయించాలి. ఇప్పుడు అల్లం వెల్లుల్లి ముద్ద వేసి వేగాక ఉడికించిన చికెన్ ముక్కలు, వేయించిన ఎగ్స్ వేసి కారం, పసుపు వేసి కలిపి రెండు నిముషాలు వేయించాలి. చివరగా అన్నం, తగినంత ఉప్పు, గరం మసాలా పొడి వేసి సన్నని సెగపై అంతా బాగా కలిసేలా కలుపుతూ వేయించాలి. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేస్తే ఎంతో టేస్టీగా ఉండే స్పైసీ చికెన్ మసాలా రైస్ రెడీ..

Exit mobile version