Soya Onion Pesarattu: నోరూరించే సోయా ఉల్లి పెసరట్టు.. ఇలా చేస్తే లొట్టలు వేసుకొని తినేయాల్సిందే?

మామూలుగా ఉదయాన్నే ఎప్పుడు ఒకే విధమైన టిఫిన్లు అనగా దోసెలు ఇడ్లీలు పూరీలు, పొంగల్ ఇలాంటివి వ్యక్తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే అప్పుడ

  • Written By:
  • Updated On - February 19, 2024 / 09:31 PM IST

మామూలుగా ఉదయాన్నే ఎప్పుడు ఒకే విధమైన టిఫిన్లు అనగా దోసెలు ఇడ్లీలు పూరీలు, పొంగల్ ఇలాంటివి వ్యక్తిని తిని బోర్ కొడుతూ ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏవైనా కొత్తగా ట్రై చేయాలని చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎలా చేయాలో తెలియక తెగ ఆలోచిస్తూ ఉంటారు. ఏదైనా సరికొత్తగా రెసిపీ చేయాలని అనుకుంటున్నారా. అయితే ఇంట్లోనే సింపుల్గా సోయా ఉల్లి పెసరట్టు ఎలా తయారు చేసుకోవాలో అందుకు ఏఏ పదార్థాలు కావాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

కావాల్సిన పదార్థాలు:

పెసరపప్పు – రెండు కప్పులు
సోయా చంక్స్- ఒకటిన్నర కప్పు
ఉల్లిపాయ – ఒకటి
అల్లం – చిన్న ముక్క
జీలకర్ర – ఒకటిన్నర స్పూను
ఉప్పు – రుచికి తగినంత
మిరియాల పొడి – అర టీస్పూను
కరివేపాకు – ఒక రెమ్మ
నూనె – సరిపడినంత

తయారీ విధానం :

నాలుగు గంటల ముందే పెసరపప్పును కడిగి నానబెట్టుకోవాలి. సోయా చంక్స్‌ను కూడా అరగంట ముందే నీళ్లలో నానబెట్టాలి. ఇవి త్వరగా నానిపోతాయి. కనుక అరగంట ముందు నీళ్లలో వేసుకుంటే సరిపోతుంది. పెసరపప్పు బాగా నానాక ఉల్లిపాయలు, కరివేపాకు, అల్లం ముక్కలుగా తరుగు కోవాలి. మిక్సీలో పెసరపప్పు ఉల్లిపాయ తరుగు, సోయా చంక్స్, అల్లం తరుగు, కరివేపాకు, మిరియాల పొడి జీలకర్ర వేసి మెత్తగా రుబ్బుకోవాలి. అవసరమైనంత నీరు కలుపుకుని దోశె వేయడానికి వీలుగా కలుపుకోవాలి. రుచి కోసం ఉప్పు వేయాలి. స్టవ్ మీద పెనం పెట్టి నూనె రాయాలి. పెనం బాగా వేడెక్కాక రుబ్బును వేసుకోవాలి. దోశెలా పలుచగా వేయాలి. రెండు వైపులా బాగా కాల్చుకుంటే సోయా ఉల్లి పెసరట్టు రెడీ..